'సలార్‌'ను నమ్ముకున్న శృతిహాసన్‌ | Shruti Haasan Expectations On Salaar Movie | Sakshi
Sakshi News home page

'సలార్‌'ను నమ్ముకున్న శృతిహాసన్‌

Published Mon, Sep 11 2023 6:48 AM | Last Updated on Mon, Sep 11 2023 8:42 AM

Shruti Haasan Expectations On Salaar Movie - Sakshi

చిత్రసీమలో అతి తక్కువ మంది బోల్డ్‌ అండ్‌ బ్యూటీలలో నటి శృతిహాసన్‌ ఒకరు. విశ్వనటుడు కమలహాసన్‌ వారసురాలైన ఈమె తండ్రికి తగ్గ తనయగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. నటిగా తన సినీ పయనాన్ని బాలీవుడ్‌లో 'లక్‌' చిత్రంతో ప్రారంభించినా ఎక్కువగా దక్షిణాదిలోనే చిత్రాలు చేస్తున్నారు. తాజాగా హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న శృతిహాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ సరసన నటించిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

(ఇదీ చదవండి: ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్)

కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శృతిహాసన్‌ ప్రస్తుతం తెలుగులో హాయ్‌ నాన్న చిత్రంలో నటిస్తున్నారు. నటి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా బహుముఖాలు కలిగిన శృతిహాసన్‌కు ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ మాతృభాష అయిన తమిళచిత్ర పరిశ్రమ ఈమె టాలెంటును పెద్దగా ఉపయోగించుకోవడం లేదనే చెప్పాలి. కారణాలు ఏమైనా విజయ్‌ సేతుపతికి జంటగా నటించిన 'లాభం' చిత్రం తర్వాత శృతిహాసన్‌ కోలీవుడ్లో కనిపించలేదు.

పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌' విడుదల తర్వాత కోలీవుడ్‌ లోనూ ఈమె బిజీ అవుతారేమో చూడాలి. అయితే ఎప్పుడు ఏదో అంశంతో వార్తల్లో ఉండే శృతిహాసన్‌ తాజాగా తను ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకొని తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో పెద్దఎత్తున హల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement