Shruti Haasan shares note for boyfriend Santanu Hazarika on Valentine's Day - Sakshi
Sakshi News home page

Shruti Haasan: ప్రియుడిపై ప్రేమను బయటపెట్టిన హీరోయిన్‌, పోస్ట్‌ వైరల్‌

Published Wed, Feb 15 2023 8:55 AM | Last Updated on Wed, Feb 15 2023 10:41 AM

Shruti Haasan Valentines Post About His Boyfriend Santanu Hazarika - Sakshi

నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంటున్న హీరోయిన్‌ శృతిహాసన్‌. తమిళంలో ఈమె చివరిగా నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే శృతిహాసన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్‌ ఉంది. అంతకుమించి మంచి విజయాలు ఉన్నాయి. ఇటీవల చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ సరసన నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ రెండు ఒకేసారి విడుదలై రెండూ సక్సెస్‌ సాధించి తన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల జాబితాలో నిలిచిపోయాయి.

ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో సలార్‌ అనే పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే శృతిహాసన్‌.. శాంతను హజారిక అనే ఆర్టిస్ట్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా శృతి తన ప్రియుడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘నువ్వు చాలా ఉత్తముడివి. నా హృదయం నీతోనే ఉంది. నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఉన్నావు. నాకు వెలుగందించిన సూర్యుడివి కూడా నువ్వే. ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలిని నేనే‘ అని రాసుకొచ్చింది. ఇందుకు ఆమె ప్రియుడు శాంతను బదులుగా ట్వీట్‌ చేస్తూ ‘ నా ప్రేయసి నువ్వే. నా ప్రపంచం నువ్వే. నా సూర్యుడు నువ్వే. నా కడలి నువ్వే. నువ్వు చాలా ఉత్తమ యువతివి‘ అని పేర్కొన్నారు. వీరి ప్రేమ ముచ్చట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

చదవండి: ప్రెగ్నెన్సీ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన సునీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement