మూడోసారి 'సింగం' వేట మొదలైంది | suriya starer singam 3 shooting begins | Sakshi
Sakshi News home page

మూడోసారి 'సింగం' వేట మొదలైంది

Jan 7 2016 1:06 PM | Updated on Sep 3 2017 3:16 PM

మూడోసారి 'సింగం' వేట మొదలైంది

మూడోసారి 'సింగం' వేట మొదలైంది

తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న... హీరో సూర్య కెరీర్ లో బిగెస్ట్ హిట్ సింగం. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో...

తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న... హీరో సూర్య కెరీర్ లో బిగెస్ట్ హిట్ సింగం. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ రీమేక్ అయి సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు మూడో కొనసాగింపును తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. సౌత్ ఇండస్ట్రీలో సీక్వల్ సినిమాలు ఆడవనే అపవాదును చెరిపేస్తూ సూపర్ హిట్ అయిన సింగం.., పార్ట్ 3 పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

మరోసారి సూర్యను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు హరి. తొలి రెండు భాగాల్లో సూర్య సరసన హీరోయిన్గా నటించిన అనుష్క మరోసారి సింగంతో జతకడుతోంది. శృతిహాసన్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోంది. డిసెంబర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా.., చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడింది. దీంతో గురువారం ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్టుగా తన ట్విట్టర్లో తెలిపాడు హీరో సూర్య. షూటింగ్ మొదలైన రోజే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement