సింగం 3 షూట్లో 99.2% వేస్ట్
సినిమా మేకింగ్ డిజిటల్ అయిన తరువాత రీల్ ఖర్చు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా అనవసరపు షాట్లతో పాటు సినిమా లెంగ్త్ ఎక్కువయ్యిందన్న కారణంతో సినిమాలో చాలా భాగం తొలగిస్తుంటారు. కొన్నిసార్లు అలా కట్ అయిన సీన్స్ ఖర్చే కోట్లల్లో ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తరువాత రీల్ ఖర్చు తగ్గినా అనవసరపు సీన్స్ తీయటం వల్ల చాలా సమయం వృధా అవుతోంది. ఇలా అనవసరపు సీన్స్ తీయటంలో సూర్య హీరోగా తెరకెక్కిన సింగం 3 రికార్డ్ సృష్టించిందన్న టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం షూట్ చేసిన మొత్తంలో కేవలం 0.8% మాత్రమే సింగం 3 సినిమాలో కనిపించనుందట, మిగతా 99.2% సినిమాలో కటింగ్స్ లో తీసేశారంటూ స్వయంగా దర్శకుడు హరి ప్రకటించాడు. సూర్య లాంటి స్టార్ హీరోతో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమాలో ఇంత సమయం వేస్ట్ చేయటమంటే మామూలు విషయం కాదు. అయితే దర్శకుడు మాత్రం ప్రస్తుతం ఉపయోగించని సీన్స్ను సింగం 4, 5 పార్ట్స్లో ఉపయోగిస్తామని చెపుతున్నాడు.
సూర్య సరసన అనుష్క, శృతిహాసన్లు నటించిన ఈ సినిమా కోసం దాదాపు 17 లక్షల రోల్స్ షూట్ చేశారట. అయితే ఫైనల్ ఎడిటింగ్ తరువాత సినిమా లెంగ్త్, కేవలం 14 వేల రోల్స్కే పరిమితం చేశారు. ఈ నెల 9న రిలీజ్ అవుతున్న సింగం 3 నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.