
మహేష్ బాటలో సూర్య
స్టార్ హీరోలు ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమకు హిట్ ఇచ్చిన దర్శకులను సర్ప్రైజ్గా కాస్ట్లీ కానుకలను అందిస్తున్నారు. గతంలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివకు హీరో మహేష్ బాబు గిఫ్ట్ ఇచ్చాడు. శ్రీమంతుడు రిలీజ్ తరువాత కొరటాల ఖరీదైన కారును కానుకగా ఇచ్చాడు మహేష్.
ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరికి 50 లక్షల ఖరీదు చేసే టొయోటా ఫార్చూనర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. సూర్యను టాప్ స్టార్ నిలబెట్టిన సింగం సీరీస్ లో మూడు వరుస సూపర్ హిట్స్ అందించిన హరి, ముందు ముందు ఇదే సీరీస్ లో మరిన్ని సినిమాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.