ఈసారైనా రిలీజ్ అవుతుందా..? | Suriya Singam 3 gets new release date | Sakshi
Sakshi News home page

ఈసారైనా రిలీజ్ అవుతుందా..?

Published Thu, Jan 26 2017 2:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

ఈసారైనా రిలీజ్ అవుతుందా..?

ఈసారైనా రిలీజ్ అవుతుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సి 3 (సింగం 3). సూర్య, హరిల కాంబినేషన్లో తెరకెక్కిన సింగం సిరీస్లో మూడో భాగంగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సూర్యను మరింత పవర్ ఫుల్ రోల్లో ఇంటర్నేషనల్ కాప్గా చూపిస్తున్నాడు హరి. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం అభిమానులను నిరాశపరుస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ ధృవ రిలీజ్ ఉండటంతో సింగం 3 వాయిదా పడింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఫైనల్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయాలని భావించారు. కానీ తమిళ నాట జల్లికట్టు నిషేదం పై నిరసనలు, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఉద్రికత్త పరిస్థితులు నెలకొనటంతో సింగం 3ని మరోసారి వాయిదా వేశారు.

తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఆడియో మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సారైన అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement