వేటకు సిద్ధమైన 'సింగం' | Suriya Singam 3 to hit the screens on January 26 | Sakshi
Sakshi News home page

వేటకు సిద్ధమైన 'సింగం'

Published Tue, Jan 17 2017 10:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

వేటకు సిద్ధమైన 'సింగం'

వేటకు సిద్ధమైన 'సింగం'

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సీరీస్ సింగం. రేసీ స్క్రీన్ప్లే, భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో తెరకెక్కిన ఈ సీరీస్లో ఇప్పటికే రెండు భాగాలు ఘనవిజయం సాధించగా.., ఇప్పుడు మూడో భాగం రిలీజ్కు రెడీ అవుతోంది. చాలా రోజుల క్రితమే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న సింగం 3, రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

సూర్య ఫ్యామిలీ బ్యానర్ స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి దర్శకుడు. ఇదే సీరీస్లో రిలీజ్ అయిన గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్తో మరింత స్టైలిష్గా సింగం 3ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ డేట్పై ఎటూ తేల్చని చిత్రయూనిట్ ఫైనల్గా జనవరి 26 సింగం 3ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. మరి సూర్య సింగంలా మరోసారి కలెక్షన్ల వేట కొనసాగిస్తాడో.. లేదో.. చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement