January 26
-
జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా!
రిపబ్లిక్‌డే జనవరి 26న ఎందుకు జరుపుకుంటామో తెలుసా?’ అనే ప్రశ్నకు...‘1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి’ అని చెబుతాం. ఇది నిజమే అయినప్పటికీ అసలు కారణం వేరు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే తేదీకి ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు. జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి? 1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ‘జనవరి 26’కి చిరస్థాయి కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారి నారాయణ్ రైజాదా తన అందమైన చేతి రాతతో హిందీ, ఇంగ్లీష్లలో రాశారు. రాయడానికి ఆరు నెలల సమయం తీసుకుంది. తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) దిల్లీలోని ఇర్విన్ యాంఫీథియేటర్ (ప్రస్తుతం మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో జరిగింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి విదేశీ సైనిక బృందం...ఫ్రెంచ్ ఆర్మీ సైనికులు (2016). ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరైన ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో. (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!) -
Republic Day Parade: పోరాట యోధుల థీమ్‌తో తెలంగాణ శకటం
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. జనవరి 26న కర్తవ్యపథ్‌లో తెలంగాణ శకటం సందడి చేయనుంది. కాగా తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి, 2020లో మరోసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం కనువిందు చేయగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రస్తుత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శకటానికి అవకాశం లభించింది మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపికైన ఏపీ శకటం.. ఈసారి డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో ప్రదర్శనకు ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారిగా 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనుంది. -
ఖైదీల్లో చిగురించిన ఆశలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): అర్థరాత్రి క్షమాభిక్ష గంట మోగింది. ఖైదీల్లో ఆశలు చిగురింపజేసింది. ఎన్నో ఏళ్లుగా నాలుగు గోడల నడుమ మగ్గుతున్న ఖైదీలు కొందరు బయటపడే మార్గం సుగమమైంది. దీంతో వారిలో ఆనందం వెల్లువిరుస్తోంది. కారాగారాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను క్షమాభిక్షపై విడదుల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మంగళవారం తీసుకొంది. అందులో భాగంగా అదేరోజు రాత్రి జీవో నంబరు 8ని విడుదల చేసింది. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారం జైళ్లలో క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను సిద్ధంచేసి జైల్ అధికారులు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. 14 మంది అర్హులతో జాబితా జీవో నంబరు 8లోని నిబంధనల ప్రకారం విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలలో అర్హుల జాబితాను అధికారులు బుధవారం సిద్ధం చేశారు. ప్రభుత్వం విడదుల చేసిన జోవో ప్రకారం ఈ నెల 26 నాటికి అర్హులైన సత్ప్రవర్తన కలిగిన 14 మంది జాబితా సిద్ధం చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు ఎక్కువమందికాగా అనంతపురం, కర్నూలుకు చెందిన ఇద్దరు ఖైదీలున్నట్లు చెప్పారు. వారిలో విశాఖకు చెందిన ఓ మహిళ విడుదలకు అర్హులైనట్లు వివరించారు. ఈ జాబితా ఇక్కడ రెండుసార్లు స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. అనంతరం డీఐజీ కార్యాలయానికి పంపిస్తామని, అక్కడ స్క్రీనింగ్ జరిగిన అనంతరం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తారన్నారు. వారు మరో రెండుసార్లు ఈ జాబితాను స్క్రీనింగ్ చేసిన అనంతరం అర్హులను ప్రకటిస్తారని తెలిపారు. అంతవరకు ఈ జాబితా గోప్యంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ఖైదీలు ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాను ఫిబ్రవరి 2న జైళ్లశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఇవీ నిబంధనలు ♦ పురుషులు రిమాండ్‌తో పాటు ఏడేళ్లు వాస్తవ జైలు శిక్ష, మరో మూడేళ్లు రెమిషన్ పీరియడ్‌తో కలసి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ మహిళలు రిమాండ్‌తో పాటు ఐదేళ్లు శిక్ష అనుభవించి రెండేళ్లపాటు రెమిషన్ పీరియడ్‌తో కలిసి మొత్తం ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వెసులుబాటు ఉంది. వారిలో పురుషులకు, మహిళలకు ఒకే విధంగా ఐదేళ్లు శిక్ష, మరో రెండేళ్లు రెమిషన్‌తో కలిపి ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ గంజాయి అక్రమ రవాణా కేసుల్లో శిక్ష పడినవారు అనర్హులు. (పదేళ్ల తర్వాత వీరు విడుదలవుతారు.) ♦ ఐపీసీ 379 నుంచి 402 సెక్షన్లపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, కింది కోర్టులో శిక్షపడి పై కోర్టుకు వెళ్లడం ద్వారా శిక్ష తగ్గిన వారు, ఉరి శిక్ష పడి రాష్ట్రపతిచే శిక్ష మార్చబడినవారు అనర్హులు. రెండేళ్ల తర్వాత మళ్లీ రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్నుడు క్షమాభిక్ష జీవో విడుదలైంది. 2015 మార్చి 15న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీని ప్రకారం 2016 జూన్‌లో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 41 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి కాలుపెట్టారు. 2013 డిసెంబరు 21న క్షమాభిక్షపై ఇక్కడి నుంచి 37 మంది ఖైదీలను విడుదల చేశారు. వారిలో ఇద్దరు మహిళా ఖైదీలున్నారు. దీంతోపాటు 2009 జనవరి 26న 25 మంది ఖైదీలు విడుదలయ్యారు. రెమిషన్ అంటే... సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలకు కొన్ని రోజులు శిక్ష పొందినట్లు కలుస్తాయి. ఇలాంటి ఖైదీలకు నెలకు 5 రోజులు చొప్పున కలుస్తాయి(ఏడాదిలో 60 రోజులు). దీంతోపాటు జైలు ఉన్నతాధికారి దృష్టిలో ఉత్తముడుగా గుర్తింపు పొందిన ఖైదీలకు ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇవి కాకుండా రాష్ట్ర జైళ్లశాఖ ఉన్నతాధికారులు సైతం ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇలా పొందిన రోజులనే రెమిషన్ పీరియడ్‌గా లెక్కిస్తారు. ఈ కాలాన్ని ఖైదీ శిక్ష అనుభవించిన కాలానికి జతచేస్తారు. ఇలా రెమిషన్ పీరియడ్ పురుషులకు మూడేళ్లు, మహిళలకు రెండేళ్లు ఉంటే క్షమాభిక్షకు ఉపయోగపడుతుంది. -
రాజస్థాన్‌లో ప్రత్యేక బలగాల మోహరింపు
జైపూర్: గణతంత్ర వేడుకల దృష్ట్యా రాజస్థాన్‌లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలు మోహరించారు. ఇటీవల కాలంలో సరిహద్దు గుండా శత్రువుల చొరబాట్లు, సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మరోపక్క, భద్రతను కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలు హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అడిషనల్ డీజీ ఎన్ఆర్కే రెడ్డి పేర్కొన్నారు. సున్నితమైన అదనపు దృష్టిని సారించినట్లు ఆయన వెల్లడించారు. -
వేటకు సిద్ధమైన 'సింగం'
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సీరీస్ సింగం. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ సీరీస్‌లో ఇప్పటికే రెండు భాగాలు ఘనవిజయం సాధించగా.., ఇప్పుడు మూడో భాగం రిలీజ్‌కు రెడీ అవుతోంది. చాలా రోజుల క్రితమే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న సింగం 3, రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సూర్య ఫ్యామిలీ బ్యానర్ స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి దర్శకుడు. ఇదే సీరీస్‌లో రిలీజ్ అయిన గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్‌తో మరింత స్టైలిష్‌గా సింగం 3ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ డేట్‌పై ఎటూ తేల్చని చిత్రయూనిట్ ఫైనల్‌గా జనవరి 26 సింగం 3ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. మరి సూర్య సింగంలా మరోసారి కలెక్షన్ల వేట కొనసాగిస్తాడో.. లేదో.. చూడాలి. -
ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి రిపబ్లిక్ డే మరుసటి రోజు 'మన్ కీ బాత్'' కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం గురించి 'ఇది ఒక అనుసంధాన ప్రక్రియ అని, ఈ కార్యక్రమంపై ప్రజలు తమ ప్రశ్నలను తన ట్విట్టర్ ఖాతాకు సంధించవచ్చ''ని ప్రధాని మోదీ గురువారం ప్రజలకు పిలుపునిచ్చారు. #AskObamaModi ట్విట్టర్ ఖాతాలకు ప్రశ్నలు సంధించవలసిందిగా ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా "మన్ కీ బాత్" కార్యక్రమం సంపూర్ణం కాదని ఆయన తెలిపారు. ఈ నెల 25 వరకు ప్రశ్నలు సంధించవచ్చని మోడీ తెలిపారు. -
‘మోనో’కు ముహూర్తం ఖరారు
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని నగరవాసులంతా ఎదురుచూస్తున్న మోనో రైలు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీనుంచి మోనో రైలు సేవలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. వాయిదాలపై వాయిదాలు పడుతున్న ఈ నెల 13వ తేదీన ఈ రైలుకు చివరిసారిగా ప్రయోగాత్మక పరుగు నిర్వహించనున్నారు. వాస్తవానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు ఏడాదిన్నర క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనేక పర్యాయాలు వాయిదా వేయకతప్పలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి విడతలో భాగంగా చెంబూర్-వడాలా మధ్య పనులు పూర్తయ్యాయి. గతంలో నిర్వహించిన వివిధ రకాల పరీక్షలు సఫలీకృతమయ్యాయి. అయితే రైల్వే బోర్డు అనుబంధ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ నుంచి భద్రతాపత్రం మంజూరు కాకపోవడంతో ఈ రైళ్లన్నీ యార్డులకే పరిమితమయాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు అసిస్టెంట్ కమిషనర్ అశ్వినిభిడే చెప్పారు. సాధ్యమైనంత త్వరగా భద్రతాపత్రం మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.