ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్' | President Obama to Join PM Modi in 'Mann ki Baat' Radio Address | Sakshi
Sakshi News home page

ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'

Published Thu, Jan 22 2015 11:03 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్' - Sakshi

ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి రిపబ్లిక్ డే మరుసటి రోజు 'మన్ కీ బాత్'' కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం గురించి 'ఇది ఒక అనుసంధాన ప్రక్రియ అని, ఈ కార్యక్రమంపై ప్రజలు తమ ప్రశ్నలను  తన ట్విట్టర్ ఖాతాకు సంధించవచ్చ''ని  ప్రధాని మోదీ గురువారం ప్రజలకు పిలుపునిచ్చారు.  #AskObamaModi ట్విట్టర్ ఖాతాలకు ప్రశ్నలు సంధించవలసిందిగా ఆయన పేర్కొన్నారు.


భారత్, అమెరికా సంబంధాలను  మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా "మన్ కీ బాత్" కార్యక్రమం సంపూర్ణం కాదని ఆయన తెలిపారు. ఈ నెల 25 వరకు ప్రశ్నలు సంధించవచ్చని మోడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement