రిపబ్లిక్‌డే జనవరి 26న ఎందుకు జరుపుకుంటామో తెలుసా?’ అనే ప్రశ్నకు...‘1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి’ అని చెబుతాం. ఇది నిజమే అయినప్పటికీ అసలు కారణం వేరు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే తేదీకి ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు.
జనవరి 26 ప్రాముఖ్యత ఏమిటి?
- 1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ‘జనవరి 26’కి చిరస్థాయి కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు
- రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారి నారాయణ్ రైజాదా తన అందమైన చేతి రాతతో హిందీ, ఇంగ్లీష్‌లలో రాశారు. రాయడానికి ఆరు నెలల సమయం తీసుకుంది.
- తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) దిల్లీలోని ఇర్విన్ యాంఫీథియేటర్ (ప్రస్తుతం మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో జరిగింది.
- రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి విదేశీ సైనిక బృందం...ఫ్రెంచ్ ఆర్మీ సైనికులు (2016).
- ఫస్ట్ రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరైన ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో.
(చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!)
Comments
Please login to add a commentAdd a comment