సింగపూర్లో సైమా సంబరం | siima awards 2016 at singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్లో సైమా సంబరం

May 7 2016 10:39 AM | Updated on Aug 11 2019 12:52 PM

సింగపూర్లో సైమా సంబరం - Sakshi

సింగపూర్లో సైమా సంబరం

గత ఐదేళ్లుగా దక్షిణాసియా చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైమా అవార్డ్స్, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

గత ఐదేళ్లుగా దక్షిణాసియా చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైమా అవార్డ్స్, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జూన్ 30, జూలై 1వ తేదీల్లో సింగపూర్లో దక్షిణాది సినిమా నటుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన వందమంది పైగా నటీనటులు పాల్గొననున్నారు. అవార్డు ప్రధానోత్సవంతో పాటు తారల పర్ఫామెన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

గత ఏడాది సైమా అవార్డ్స్ను దుబాయ్లో నిర్వహించగా ఈ ఏడాది సింగపూర్ వేదికగా నిర్వహిస్తున్నారు. శ్రుతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, హ్యూమా ఖులషీ లాంటి ఎంతో మంది తారలు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సైమా అవార్డ్స్ ఏర్పాట్లను హీరో రానా, హీరోయిన్ శృతిహాసన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement