సెల్ఫీ అదిరింది.. | 'A picture that speaks a 1000 words and more' tweets Rana | Sakshi
Sakshi News home page

సెల్ఫీ అదిరింది..

Published Fri, Jul 1 2016 5:37 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

'A picture that speaks a 1000 words and more' tweets Rana

ఒక్క సెల్ఫీ 1000 కన్నా ఎక్కువ మాటలు మాట్లాడుతుందంటున్నాడు టాలీవుడ్ కండలవీరుడు రానా.  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా)  6 వ వార్షిక వేడుక సింగపూర్లో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రముఖులతో వేడుక ప్రాంగణం వెలిగిపోతుంది. వేడుకలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరు తిరిగి సినిమాల్లో నటిస్తున్నందుకుగాను పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందనల్లో ముంచెత్తారు. చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు యువ నటీనటులతోపాటు పలువురు తారలు పోటీ పడటం చిరు క్రేజ్ను మరోసారి తళుక్కుమనిపించింది.  

'బాహుబలి' సినిమాలో భల్లాలదేవగా నెగెటివ్ రోల్లో ఉత్తమ నటన కనబరిచినందుకుగాను సైమా అవార్డును అందుకున్నాడు రానా. 'జై మాహిష్మతీ' అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. సింగపూర్లో అడుగుపెట్టినప్పటి నుంచి వేడుక విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న రానా.. తాజాగా ఓ భారీ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, అల్లు అరవింద్, రాధిక, ఖుష్బూ తదితరుల నుంచి సమంత, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మెహరీన్  లాంటి నవతరం నటుల వరకు చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చిన ఆ సెల్ఫీకి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.  మీరూ ఓ లుక్కేయండి..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement