భల్లాలదేవుడికి ఏమైంది?
బాహుబలి-2 షూటింగ్ లో రానా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. మణికట్టుకు బ్యాండేజి వేసున్న ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన మణికట్టుకు గాయమైందని, అందువల్ల ఈ టేప్ వేసుకున్నానని చెప్పాడు. త్వరలోనే మళ్లీ పూర్తిస్థాయి శిక్షణ కోసం ఎదురుచూస్తున్నానన్నాడు. దాంతో త్వరగా కోలుకోండంటూ అభిమానుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారీ యాక్షన్ సినిమాల షూటింగుల్లో ఇటువంటి గాయాలు సాధారణమేనంటూ ఇదివరకు గాయాలపాలైనప్పుడు రానా అన్నారు.
కాగా బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2017లో బాహుబలి- 2 సినిమా రిలీజ్ కానున్నప్పటికీ.. రాజమౌళి షూటింగ్ పనుల్ని చకచకా చేసేస్తున్నాడు. రానా, అనుష్క షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. మొత్తం షూటింగ్ అక్టోబర్ వరకు పూర్తవుతుందని అంచనా. 2017 వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Taped up my damaged wrist for full blown training soon!! #Baahubali https://t.co/kUqGbyUGMV
— Rana Daggubati (@RanaDaggubati) 25 May 2016