సెప్టెంబర్లో ప్రేమమ్
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమమ్. మళయాలంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.
చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటి మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. అందుకే ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.