చైతూ హీరోగా బహుభాషా చిత్రం | Naga Chaitanya to act in Tamil Director Karthick Naren | Sakshi
Sakshi News home page

చైతూ హీరోగా బహుభాషా చిత్రం

Published Thu, Feb 16 2017 1:28 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

చైతూ హీరోగా బహుభాషా చిత్రం

చైతూ హీరోగా బహుభాషా చిత్రం

కెరీర్ పరంగానే కాదు, వ్యక్తిగత జీవితం పరంగానూ అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అదే ఫాంలో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు చైతన్య. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను అంగీకరించాడు నాగచైతన్య. తమిళ్లో 'ధృవంగల్ పదినారు' సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు కార్తీక్ నరేన్, నాగచైతన్య హీరోగా  సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు ఓ మలయాళ యంగ్ హీరో నటించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల హీరోలు నటిస్తున్న ఈ సినిమాను మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement