ప్రేమమ్ కాంబినేషన్లో మరో సినిమా | Premam combination again | Sakshi
Sakshi News home page

ప్రేమమ్ కాంబినేషన్లో మరో సినిమా

Published Fri, May 5 2017 1:25 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

ప్రేమమ్ కాంబినేషన్లో మరో సినిమా

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమమ్. మలయాళ సూపర్ హిట్కు రీమేక్గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కార్తీకేయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటి ప్రేమమ్ సక్సెస్తో మరోసారి ఆకట్టుకున్నాడు. మలయాళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన చందూ అక్కినేని హీరోలతో మరో ఛాన్స్ కొట్టేశాడు.

ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పనులను దాదాపుగా పూర్తి చేసిన నాగచైతన్య, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రేమమ్ కాంబినేషన్ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement