కంట్లో నీళ్లొచ్చాయి : నాగార్జున | Premam Success Meet Nagarjuna Cries After Watching Premam | Sakshi
Sakshi News home page

కంట్లో నీళ్లొచ్చాయి : నాగార్జున

Published Wed, Oct 19 2016 11:25 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

కంట్లో నీళ్లొచ్చాయి : నాగార్జున - Sakshi

కంట్లో నీళ్లొచ్చాయి : నాగార్జున

‘‘ ‘ప్రేమమ్’ విడుదలకు వారం ముందే చందూ నాకు సినిమా చూపించాడు. ఇప్పుడే ‘ప్రేమమ్’ చూశా బాగుంది, హ్యాపీగా ఇంటికెళుతున్నానని అదే రోజు ట్వీట్ చేశా. క్లయిమాక్స్‌లో శ్రుతీహాసన్ సన్నివేశానికి కంట్లో నీళ్లొచ్చాయి. సినిమాలో రెండు మూడు చోట్ల అదే ఫీల్ కలిగింది’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ సక్సెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
 
నాగార్జున మాట్లాడుతూ : ‘‘ప్రేమమ్’ వంటి చిత్రం చేయాలంటే గట్స్ ఉండాలి. ఈ చిత్రం డైలాగులు చూస్తుంటే చందూ నా ఫ్యాన్ అనిపించింది. తను నాతో ఒక సినిమా తీయాలి. చాలామంది నన్ను  చైతన్యతో, అఖిల్‌తో ‘శివ’ సీక్వెల్ తీయొచ్చు కదా? అని అడుగుతుంటారు. అది ఇంపాజిబుల్ అంటుంటాను’’ అన్నారు. ‘ప్రేమమ్’లో చూపించినట్టు మీతో చెప్పుకోలేని సమస్యలేవైనా చైతూకి ఉంటే మేనమామ(వెంకటేష్) పరిష్కరిస్తారా? అని విలేకరులు అడగ్గా, ‘‘అది సినిమా మాత్రమే.
 
మా ఇంట్లో అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం’’  అని నాగార్జున నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘ఓ క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలంటే ధైర్యం కావాలి. మేం చేసి సక్సెస్ అయ్యాం. జనరల్‌గా దర్శకులు ఈ చిత్రం మీ కెరీర్‌లో బిగ్ హిట్ అవుతుందని చెబుతారు. చందూ మాత్రం చెప్పకుండా హిట్ ఇచ్చారు’’ అని నాగచైతన్య అన్నారు. చందూ మొండేటి, సమర్పకుడు పీడీవీ ప్రసాద్, నటుడు ప్రవీణ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement