నాగ్ ఎవరు? వెంకీ ఎవరు? | Nagarjuna And Venkatesh To Play Cameo In Naga Chaitanya's Premam | Sakshi
Sakshi News home page

నాగ్ ఎవరు? వెంకీ ఎవరు?

Published Fri, Aug 26 2016 11:05 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ ఎవరు?  వెంకీ ఎవరు? - Sakshi

నాగ్ ఎవరు? వెంకీ ఎవరు?

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ తెలుగులో నాగచైతన్య హీరోగా అదే పేరుతో రీమేక్ అయి, విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున, వెంకటేశ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ఈ ఇద్దరూ చేసిన పాత్రలు ఎలా ఉంటాయి? అనే చర్చ జరుగుతోంది. మలయాళ ‘ప్రేమమ్’ చూసినవాళ్లైతే రెంజీ పానికర్, మణియన్ పిళ్ల రాజు  చేసిన పాత్రలను వెంకీ, నాగ్ చేసి ఉంటారని ఓ నిర్ణయానికి వచ్చారు.
 
 మలయాళ మాతృకలో హీరో నివిన్ పౌలి తండ్రి పాత్రను రెంజీ పానికర్, కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రను మణియన్ చేశారు. ఈ రెండు పాత్రలూ కనిపించేది కాసేపే అయినా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ రెండు పాత్రలనే నాగ్, వెంకీ చేసి ఉంటారు. మరి.. రెంజీ పానికర్ చేసిన పాత్రను ఎవరు చేసి ఉంటారు? మణియన్ పాత్రను ఎవరు చేసి ఉంటారు? అనేది తెలియాల్సి ఉంది. నాగచైతన్య రియల్ డాడ్ నాగ్ కాబట్టి, రీల్‌పై డాడ్ పాత్రను చేసి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. అప్పుడు వెంకీ కాలేజీ ప్రిన్సిపాల్ పాత్ర చేసి ఉంటారేమో. ఎవరు ఏ పాత్రలో కనిపించినా సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement