చైతూ సినిమాలో నాగ్? | Nagarjuna Plays Special Role in Premam | Sakshi
Sakshi News home page

చైతూ సినిమాలో నాగ్?

Published Tue, May 3 2016 1:09 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

చైతూ సినిమాలో నాగ్? - Sakshi

చైతూ సినిమాలో నాగ్?

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ తెలుగులో అదే పేరుతో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశి, పీడీవీ ప్రసాద్ సమష్టిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో పాత్ర మూడు దశలుగా సాగుతుంది. ఆ మూడు దశల్ని తెర వెనుక నుంచి వ్యాఖ్యాతగా చెప్పడంతో పాటు సినిమాలో అతిథి పాత్రలో నటించమని నాగార్జునను చిత్రదర్శకుడు చందు మొండేటి కోరారట. నాగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అదే నిజమైతే ‘మనం’ తరువాత మళ్ళీ తన తండ్రితో కలసి నటించినందుకు నాగచైతన్య ఆనందపడతారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement