అల్లుడి సినిమాలో అతిథిగా..! | venkatesh guest appearance in naga chaitanya movie | Sakshi
Sakshi News home page

అల్లుడి సినిమాలో అతిథిగా..!

Published Fri, Mar 25 2016 10:11 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

అల్లుడి సినిమాలో అతిథిగా..!

అల్లుడి సినిమాలో అతిథిగా..!

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా తన అల్లుడు నాగచైతన్య సినిమాలో కావటం మరో విశేషం. టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో నాగచైతన్య, వెంకటేష్ల కాంబినేషన్.., సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

నాగ్ చైతన్య, ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ మూమీ ప్రేమమ్ రీమేక్లో నటిస్తున్నాడు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రలో నటించడానికి వెంకటేష్ ఒకే చెప్పాడు. త్వరలోనే వెంకీ , చైతూల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement