మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. సినిమాలో కూడా చైతూకి అంకుల్గానే కనిపిస్తారట. నాగ చైతన్య తదుపరి చిత్రం 'ప్రేమమ్' లో అతిధి పాత్రలో నటించడానికి వెంకీ ఓకే అన్నారని టాక్. రానా, వెంకీలతో కలిసి నటించాలని ఉందని ఇంతకుముందే చైతూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మనువళ్లతో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించాలనేది స్వర్గీయ డా.డి.రామానాయుడి కోరిక కూడా. అయితే సరైన స్క్రిప్ట్ కుదరక అది జరగలేదు. అనుకోకుండా ఇలా వెంకీ, చైతూలు ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకు పండగే.
ప్రేమమ్ తమిళ మాతృకలో ఆ పాత్రను మళయాళ ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత అయిన రెంజీ పణికర్ పోషించారు. త్వరలో వెంకీ, చైతూల మధ్య జరిగే ఎపిసోడ్స్ను చిత్రీకరించనున్నారు. ఈ వేసవికి సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. చైతన్య సరసన శృతి హాసన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు.
వెంకీ మామ, చైతూ బాబు.. ఒకే సినిమాలో
Published Thu, Mar 24 2016 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement
Advertisement