చైతూ, ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందా..? | Naga Chaitanya new movie halted | Sakshi
Sakshi News home page

చైతూ, ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందా..?

Published Mon, Nov 28 2016 11:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

చైతూ, ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందా..?

చైతూ, ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందా..?

ప్రేమమ్ సినిమా సక్సెస్తో నాగచైతన్య రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న చైతూ, తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాల విషయంలో కూడా పునరాలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రేమమ్ రిలీజ్కు ముందే, సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్ర బ్యానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయి పోయాయి.

అయితే ఇంద్రగంటితో చేయాలకున్న సినిమాను ప్రస్తుతం క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. ఈ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేసి అదే బ్యానర్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంద్రగంటి, నాగచైతన్య సినిమా మీద ఆశలు వదులుకొని సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ సినిమాలపై అధికారిక ప్రకటన మాత్రం రాకపోయినా.. నాగచైతన్య, ఇంద్రగంటి మోహన కృష్ణల సినిమా క్యాన్సిల్ అయినట్టుగా ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement