indhraganti mohana krishna
-
హీరో కేరాఫ్ వర్సటాలిటీ
ఘట్టమనేని ఫ్యామిలీ హీరోల్లో మహేష్ తరువాత క్రేజ్ తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. అందుకు తగ్గట్టుగా సుధీర్ బాబు కూడా ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కుతూ హిట్స్, ఫ్లాప్స్కి అతీతంగా కెరీర్ సాగిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథా చిత్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేసిన సుధీర్ బాబు, ఆ తరువాత చాలా సెలెక్టివ్ గా ఉంటూ మంచి హిట్స్ సాధించాడు. స్టార్‌గా కన్న నటుడిగా మంచి మార్కులు సాధించి క్రియేటివ్ డైరెక్టర్స్ అంటూ తమకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఇంద్రగంటి, చంద్రశేఖర్ యేలేటి కృష్ణవంశీ వంటి దర్శకులు దృష్టిని ఆకర్షించడంలో సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడు. అలా ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సమ్మోహనం సుపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసిన సుధీర్ బాబు, అదే ఊపులో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి నన్నుదోచుకుందువటే అనే చిత్రాన్ని తీసి ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. అలానే బాడీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న సుధీర్ బాబు, బాలీవుడ్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ భాగీలో విలన్‌గా నటించిన ఈ తెలుగు హీరోకి ఇప్పుడు నార్త్ నుంచి కూడా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుధీర్ బాబు, దాంతో పాటే తెలుగు నాట నానితో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. వీరిద్దరిలో కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వి’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు. సుధీర్ బాబు ఇమేజ్ బ్యారియర్స్‌లో ఉండిపోకుండా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తుండటంతో క్రియేటివ్ థాట్స్‌తో వచ్చే డైరెక్టర్స్ బెస్ట్ చాయిస్ అన్న పేరు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్న గోపిచంద్ బయోపిక్, వి సినిమాలు మంచి విజయం సాధిస్తే కమర్షియల్గానూ తన మార్కెట్‌ను మరింత పెరుగుతుందంటున్నారు ఫ్యాన్స్. -
మరో మల్టీస్టారర్.. హీరోలు ఫిక్స్
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందుకు ఈ జానర్లో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ జనరేషన్లో మల్టీస్టారర్ సినిమాలకు తెరతీసిన టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వరుసగా మల్టీస్టారర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరోస్టారర్ నిర్మించనున్నట్టుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై మరో ఆసక్తికర అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని, శర్వానంద్ లు హీరోలుగా నటించనున్నారట. గతంలో నాని హీరోగా థ్రిల్లర్ జానర్లో జెంటిల్మెన్ సినిమాను తెరకెక్కించి సక్సెష్ అయిన ఇంద్రగంటి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
‘సమ్మోహనం’ మూవీ రివ్యూ
టైటిల్ : సమ్మోహనం జానర్ : ఎమోషనల్ లవ్ డ్రామా తారాగణం : సుధీర్ బాబు, అదితి రావు హైదరీ, నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, హరితేజ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ స్టార్ ఇమేజ్ను కాకుండా కథా బలాన్ని నమ్ముకొని సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మా, జెంటిల్మన్, అమీతుమీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మోహనకృష్ణ ఈ సారి సమ్మోహన పరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరిచిందా..? మోహనకృష్ణ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా..? లవర్ బాయ్‌గా సుధీర్ బాబు ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; ఆర్.విజయ్ కుమార్ అలియాస్ విజ్జు (సుధీర్ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్ ఫ్రెండ్స్, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన ‘అనగనగా పబ్లికేషన్స్’ ద్వారా తన బొమ్మల పుస్తకాన్ని విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. సర్వేష్(సీనియర్ నరేష్), విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్‌తీసుకొని మరి సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు సర్వేష్. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితి రావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్ ఇస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి (సాక్షి రివ్యూస్) తన ప్రేమ విషయం చెపుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు సమీరా మీద కోపం పెంచుకుంటాడు. అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? అసలు సమీరా, విజ్జు అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ జీవించారు. స్టార్ ఇమేజ్, ప్రేమ, వేదింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్రా లోకేష్ హుందాగా కనిపించారు.(సాక్షి రివ్యూస్) ముఖ్యంగా సుధీర్ బాబు, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌గా రాహుల్ రామకృష్ణ, అభయ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రలో తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ; సమ్మోహనం అనే టైటిల్‌తోనే ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథా కథనాలతో నిజంగానే సమ్మోహనపరిచారు. ప్రేమకథకు బలమైన ఎమోషన్స్, కామెడీని జోడించి మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ముఖ్యంగా తొలి భాగంలో హీరో ఇంట్లో షూటింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా వాళ్ల మీద వేసిన పంచ్‌లు బాగా పేలాయి. ప్రేమకథ మొదలైన తరువాత కథనంలో కాస్త వేగం తగ్గింది. ఆ లోటును సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తన మెలోడియస్ మ్యూజిక్‌తో కవర్ చేశాడు. (సాక్షి రివ్యూస్) ప్రతీ పాట కథలో భాగంగా వస్తూ అలరిస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ డైలాగ్స్. చాలా సందర్భాల్లో డైలాగ్స్ మన జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తాయి, ఆలోచింపచేస్తాయి. పీజీ విందా సినిమాటోగ్రఫి సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ ఆర్టిస్ట్స్ నటన డైలాగ్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘సమ్మోహన’పరిచేది ఎప్పుడంటే..?
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. మల్టీ స్టారర్ సినిమాలతో పాటు బాలీవుడ్లో ప్రతినాయకుడిగానూ నటించి మెప్పించాడు. తాజాగా నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం సమ్మెహనం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన అదితీరావ్ హైదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను రంజాన్ కానుకగా జూన్ 15న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
యంగ్ హీరో న్యూ ఇయర్ ప్లాన్స్
కొత్త ఏడాదిలో వరుస సినిమాలతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ ఏడాది తాను చేయబోయే సినిమాలను కూడా ప్రకటించాడు. గత ఏడాదిలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు సుధీర్. 2017లో రిలీజ్ అయిన శమంతకమణి సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన సుధీర్ బాబు ఈ పాత్ర ద్వారా తన తల్లి తనకు మరింత దగ్గరయ్యిందని తెలిపాడు. ఇక 2018లో తాను నాలుగు సినిమాలు చేయబోతున్నట్టుగా వెల్లడించాడు. జాతీయ అవార్డు పొందిన దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రవీణ్ సత్తారులతో సినిమాలు చేయనున్న సుధీర్ ఇంద్రసేన, ఆర్ఎస్ నాయుడు అనే కొత్త దర్శకులతోనూ సినిమాలు చేయనున్నాడు. అంతేకాదు ఈ ఏడాదిలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభిస్తున్నాడు. Finally can’t thank enough all my supporters & well wishers...thank you for being there next to me & hopefully you continue to do that in 2018🙏 wish you & your family a very #HappyNewYear 🤗🤗 — Sudheer Babu (@isudheerbabu) 1 January 2018 -
చైతూ, ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందా..?
ప్రేమమ్ సినిమా సక్సెస్‌తో నాగచైతన్య రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న చైతూ, తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాల విషయంలో కూడా పునరాలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రేమమ్ రిలీజ్‌కు ముందే, సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్ర బ్యానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయి పోయాయి. అయితే ఇంద్రగంటితో చేయాలకున్న సినిమాను ప్రస్తుతం క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేసి అదే బ్యానర్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంద్రగంటి, నాగచైతన్య సినిమా మీద ఆశలు వదులుకొని సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ సినిమాలపై అధికారిక ప్రకటన మాత్రం రాకపోయినా.. నాగచైతన్య, ఇంద్రగంటి మోహన కృష్ణల సినిమా క్యాన్సిల్ అయినట్టుగా ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. -
'జెంటిల్మన్' మూవీ రివ్యూ
టైటిల్ : జెంటిల్మన్ జానర్ : థ్రిల్లర్ తారాగణం : నాని, నివేదా థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాధ్ వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా, అతడిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్మన్. వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నాని ఈ సినిమాతో కూడా మరోసారి అదే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ టైమ్ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో నాని కనిపించటంతో, పాటు దర్శకుడు మోహనకృష్ణ కూడా తొలిసారిగా థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను డీల్ చేశాడు. మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఫలించిందా..? నాని జెంటిల్మన్గా అభిమానులను మెప్పించాడా.? కథ : జయరామ్ ముళ్లపూడి (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, జైగౌరీ కంపెనీ అధినేత. మంచి బిజినెస్ మన్ గానే కాదు.. మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్‌ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో కలిసిన క్యాథరిన్(నివేదా)కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలవుతుంది. ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్‌ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్‌కు, గౌతమ్‌కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..? విలనా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : జయరామ్‌గా రిజర్వర్డ్గా, గౌతమ్‌గా ఎనర్జిటిక్‌గా రెండు పాత్రల్లోనూ నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని నేచురల్ స్టార్‌గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ ఆకట్టుకుంది. బాయ్ ఫ్రెండ్‌ను పొగొట్టుకొని, ఆ బాధలోనే అతని మరణం వెనక రహాస్యాన్ని ఛేదించే అమ్మాయిగా మంచి నటన కనబరిచింది. సురభి పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో అందంతో అభినయంతో మెప్పించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రలలో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్‌లు తమ పరిధి మేరకు పాత్రలకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత లాంటి క్లాస్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారిగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్లో నడిపించిన మోహనకృష్ణ, సెకండ్ హాఫ్‌లో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ముఖ్యంగా నాని పాత్రను మలచిన తీరు ఆకట్టుకుంటుంది. లాస్ట్ సీన్ వరకు అభిమానులను కట్టి పడేసేలా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు మోహనకృష్ణ. సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంట్రస్టింగ్‌గా మలిచాడు, అయితే పాటల విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పిజి విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి. ప్లస్ పాయింట్స్ : నాని పర్ఫామెన్స్ స్క్రీన్‌ప్లే నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ పాటలు ఓవరాల్‌గా జెంటిల్మన్ నాని స్థాయిని పెంచే పర్ఫెక్ట్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
సోలోగా వస్తున్న జెంటిల్‌మేన్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్‌లకు సరైన టైం దొరకటమే కష్టంగా మారింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడక తప్పటం లేదు. భారీ హైప్ క్రియేట్ చేసే సినిమాలు రిలీజ్ ఉంటే ఆ సినిమాకు ఒక వారం ముందు, ఒక వారం తరువాత ఎలాంటి రిలీజ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సొలోగా బరిలో దిగే చాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నాని. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపిస్తున్న నాని, తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. జెంటిల్‌మేన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, నివేదితా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని హీరోనా..? విలానా..? అంటూ ప్రమోషన్‌తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు. ముందుగా జూన్ 10నే రిలీజ్ చేయాలని భావించినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయంలో హడావిడి ఉండకూడదన్న కారణంతో వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అయితే నాని సినిమాకు దరిదాపుల్లో స్టార్ హీరోల సినిమాలే కాదు, మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ కావటం లేదు. దీంతో మరోసారి నాని కలెక్షన్ రికార్డ్‌లు సాధించటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి ఫాంలో ఉన్న నటుడు నాని. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా ప్రస్తుతం ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, తన అభిమానులతో పాటు భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య అభిమానులను కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో తన చేతి మీద జై బాలయ్య అనే టాటూతో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ విషయంలో జై బాలయ్య ప్లాన్ బాగా వర్కవుట్ కావటంతో మరోసారి బాలయ్య అభిమానులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు నాని. అందుకే తన నెక్ట్స్ సినిమా జెంటిల్మేన్ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రిలీజ్ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండోసారి బాలయ్య ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన నాని ఈసారి కూడా మెప్పిస్తాడేమో చూడాలి. -
నాని ఖాతాలో మరో వెరైటీ టైటిల్
కొద్ది రోజులుగా తన సినిమా టైటిల్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్న నాని మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో ఎవడే సుబ్రమణ్యం అనే టైటిల్‌తో వచ్చిన నాని మంచి విజయం సాధించాడు. కేవలం టైటిల్ పరంగానే కాదు కథా కథనాల పరంగా కూడా ఆకట్టుకున్న ఈ సినిమా, నాని కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. తరువాత కూడా టైటిల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. మారుతి దర్శకత్వంలో భలే భలే మొగాడివోయ్ టైటిల్‌తో ఆకట్టుకున్న నాని, తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ అంటూ పొడవాటి టైటిల్‌తో కూడా మెప్పించాడు. ఈ రెండు సినిమాలు నానికి స్టార్ ఇమేజ్ను సాధించి పెట్టాయి. తాజాగా తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాకు కూడా ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశాడు. ముందుగా ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్‌ను నిర్ణయించినా, ఫైనల్‌గా ఎవడితడు అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. నాని సరసన నివేదితా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఉయ్యాల జంపాల డైరెక్టర్‌తో నాని
ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయం సాధించిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించినా.. తరువాత అవకాశాలు పొందటంలో మాత్రం ఈ యువ దర్శకుడు వెనకపడ్డాడు. తొలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వర్మ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నయంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విరించి వర్మతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు నాని. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్న వర్మ, నటీనటులు ఎంపిక కూడా మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది.