సోలోగా వస్తున్న జెంటిల్మేన్ | No Competition for Nani gentleman | Sakshi
Sakshi News home page

సోలోగా వస్తున్న జెంటిల్మేన్

May 24 2016 9:06 AM | Updated on Sep 4 2017 12:50 AM

సోలోగా వస్తున్న జెంటిల్మేన్

సోలోగా వస్తున్న జెంటిల్మేన్

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్లకు సరైన టైం దొరకటమే కష్టంగా మారింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోటి పడక తప్పటం లేదు. భారీ హైప్ క్రియేట్ చేసే సినిమాలు...

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్లకు సరైన టైం దొరకటమే కష్టంగా మారింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడక తప్పటం లేదు. భారీ హైప్ క్రియేట్ చేసే సినిమాలు రిలీజ్ ఉంటే ఆ సినిమాకు ఒక వారం ముందు, ఒక వారం తరువాత ఎలాంటి రిలీజ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం కష్టంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా సొలోగా బరిలో దిగే చాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో నాని. ప్రస్తుతం వరుస సక్సెస్లతో మంచి ఫాంలో కనిపిస్తున్న నాని, తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. జెంటిల్మేన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, నివేదితా థామస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాని హీరోనా..? విలానా..? అంటూ ప్రమోషన్తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు. ముందుగా జూన్ 10నే రిలీజ్ చేయాలని భావించినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయంలో హడావిడి ఉండకూడదన్న కారణంతో వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అయితే నాని సినిమాకు దరిదాపుల్లో స్టార్ హీరోల సినిమాలే కాదు, మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ కావటం లేదు. దీంతో మరోసారి నాని కలెక్షన్ రికార్డ్లు సాధించటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement