అఖిల్ సరసన మలయాళీ భామ..? | Akhil to romance with Nivedha Thomas | Sakshi
Sakshi News home page

అఖిల్ సరసన మలయాళీ భామ..?

Published Sat, Sep 24 2016 2:05 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

అఖిల్ సరసన మలయాళీ భామ..?

అఖిల్ సరసన మలయాళీ భామ..?

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు ఏడాది కాలంగా సరైన కథ, దర్శకుడి కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరో ఇటీవల విక్రమ్ కుమార్తో రెండో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సినిమా ఏ జానర్లో ఉంటుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్గా మలయాళీ బ్యూటి నివేదా థామస్ నటించనుందట. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా, తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అఖిల్ లాంటి క్రేజ్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement