నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేధా థామస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు.
► కొత్త కంటñ ంట్‌తో వచ్చే సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం రావటం అదృçష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమాని థియేటర్‌లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. ఓటీటీ ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. నా ప్రతి సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 షోను కర్టెన్ పక్కన నిలబడి చూసేవాణ్ణి. అది మిస్ కాకూడదని థియేటర్ ఫీలింగ్ కోసం మా ఫ్యామిలీకి ఓ షో వేస్తున్నాను.
► ఇంద్రగంటిగారితో నా ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మా’ చేశాను. ఈ పన్నెండేళ్లలో నేను, ఆయన వ్యక్తిగతంగా కొంచెం కూడా మారలేదు. కానీ వృత్తిపర ంగా దర్శకునిగా ఇంద్రగంటిగారు, నటునిగా నేను, కెమెరామేన్‌గా విందా చాలా గొప్పగా ఎదిగాం అనిపించింది. ఈ ‘వి’ సినిమాకి హీరో ఇంద్రగంటిగారే. మా ‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవ్వటం అనుకోకుండా జరుగుతోంది.
► ‘వి’ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందనుకుంటున్నా (న వ్వుతూ). ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు బ్యాడ్‌బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు. కావాలంటే చూడండి రానా, సోనూ సూద్‌లకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ‘వి’ కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. చాలామంది చివరికి వచ్చేసరికి నాని హీరో అవుతాడు, సుధీర్ విలనవుతాడని రాస్తున్నారు. అసలు అలాంటిదేం లేదు. లైఫ్ అంతా సాఫీగా నడుస్తోన్న ఒక సెలబ్రిటీ పోలీస్ లైఫ్‌లోకి ఒకడొచ్చాడు. ఇంతే సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ పాత్రలకు కనెక్ట్ అయి చిన్న ఎమోషన్ ఫీలవుతారు.
► ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను ఇలా (ఓటీటీలో) విడుదల చేస్తున్నందుకు ‘దిల్’ రాజుగారు చాలామందికి సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఓ డిస్ట్రిబ్యూటర్. రాజుగారూ.. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీతో పాటు మేమున్నాం అని నావైపు నుండి పూర్తిగా సపోర్ట్ చేశాను. నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవటం మన బాధ్యత.
► లాక్‌డౌన్ ముందు రాజమండ్రిలో 20 రోజులు, పళనిలో 15 రోజులు షూటింగ్ చేశాను. షూటింగ్ చేసొచ్చిన ప్రతిసారీ మా అబ్బాయి జున్ను కొత్తగా కనిపిస్తుంటాడు. త్వరగా పెరిగిపోతున్నాడే, ఇలాంటి క్యూట్ ఏజ్‌ను మిస్ అవుతున్నానే అనుకునేవాణ్ణి. ఈ లాక్‌డౌన్‌లో 24 గంటలూ వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను.
► నటులందరూ బాధ్యతగా ఉండి నిర్మాతకు డబ్బు రాకపోతే అసలు రూపాయి కూడా తీసుకోకుండా పని చేయొచ్చు. అంతేకానీ ఒక్కో నటునికి 20 శాతం, 30 శాతం కట్ చేయాలని చాంబర్ రూల్ పెట్టిందని కాకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అంతేకానీ ఈ సమస్యను జనరలైజ్ చెయ్యకూడదు.
► ‘టక్ జగదీష్’ సినిమా 50 శాతం పూర్తయింది. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ‘శ్యామ్‌సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘టక్ జగదీష్’ పూర్తవ్వగానే అది మొదలవుతుంది. మరో రెండు కథలు ఓకే చేశాను. ఒకటి కొత్త దర్శకుడు, మరోటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో చేస్తాను.
► జనరల్‌గా నేను ఫిట్‌నెస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టను కాబట్టి ఇప్పుడొచ్చిన గ్యాప్‌లో ఫుల్‌గా ఫిట్‌నెస్ పెంచుకుని సిక్స్‌ప్యాక్ చేద్దామనుకున్నాను. అలాగే పియానో నేర్చుకుందామనుకున్నాను. మా అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు. తినడం.. పడుకోవటం.. మా జున్నుతో ఆడుకోవటంతోనే ఆరు నెలలు గడిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment