Sudeer babu
-
నవ దళపతి 'సుధీర్ బాబు' పాన్ ఇండియా సినిమా ఫిక్స్
వైవిధ్యమైన చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న కథానా యకుడు సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న ఈయన ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుంది.ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత ఉంది. వెంట్ కళ్యాణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 14న విడుదలైన హరోంహర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అందులో యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ కథనానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.రుస్తుం, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఇప్పుడు సుధీర్ బాబు చేయబోతున్ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. త్వరలోనే మేకర్స్ ఆ వివరాలను తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు.లోతైన కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి జరిగే యుద్ధంగా ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది.ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ 'నేను ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది'. అని ఆయన అన్నారు.ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఇది వెలికి తీస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. -
బిగ్‌బాస్ రెండోవారం ఇంటి కెప్టెన్ అతడే.. కొట్టేసుకుందాం అన్న గీతూ
బిగ్‌బాస్ సీజన్-6లో రెండోవారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించి వారికి టాస్కులు ఇచ్చారు. ఇందులో ఎవరు విజేతగా నిలిచారన్నది బిగ్‌బాస్-6 పదమూడో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ రెండోవారం కెప్టెన్సీ టాస్కులో ఎలాంటి సస్పెన్స్ లేకుండా రాజ్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈవారం ఎలిమినేషన్లో ఉండటం రాజ్‌కు కలిసొచ్చింది. దీంతో ఈ కెప్టెన్సీ టాస్క్ అతనికి ఏమైనా హెల్ప్ అవుతుందని భావించిన ఇంటిసభ్యులు అతనికే ఏకాభిప్రాయంతో ఓట్లేశారు. అయితే ఇంత కష్టపడినా తనకు ఒక్కరు కూడా ఓటు వేయలేదంటూ ఇనయా తెగ ఫీల్ అయిపోయింది. చివరికి అత్యదిక ఓట్లతో రాజ్ కెప్టెన్సీ కుర్చీపై కూర్చొని ఇంటి సభ్యల కోసం ఏదైనా పనిష్మెంట్ వస్తే అది తానే తీసుకుంటానంటూ వాగ్ధానం చేస్తాడు. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్‌బాబు, కృతిశెట్టి హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. పాపులర్ డైలాగులను తమ స్టైల్లో చెప్పాలంటూ టాస్కులు ఆడించారు. ఇందులో రేవంత్ మొదటగా పోకిరి సినిమాలోని ‘ఎవడు కొడ్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్ చెప్పాడు. ఆ తర్వాత గీతూ వచ్చి తమిళ్ ఏంటి? తెలుగేంటి? డార్లింగ్.. గొడవైంది, కొట్టేసుకుందాం రా అంటూ తన స్టైల్లో చెప్పి సూపర్ అనిపించింది. అంతేకాకుండా ఇదే డైలాగ్‌ను చిన్నపిల్లల వాయిస్‌లో చెప్పి ఆశ్చరానికి గురిచేసింది. ఇక ఈ టాస్కులో సత్య, రాజ్, శ్రీహాన్‌లు చేసిన ఓ స్కిట్ ఆకట్టుకుంది. ఇక చివర్లో సత్యను బెస్ట్ యాక్ట్రెస్‌గా, శ్రీహాన్‌కు బెస్ట్ యాక్టర్‌గా ప్రకటించి అవార్డులు ఇచ్చారు. -
చలాకీ చంటీపై చేయిచేసుకున్న ఆర్జే సూర్య!.. షాక్ అయిన సుధీర్ బాబు
బిగ్‌బాస్ హౌస్‌లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో సరదాగా గడిపారు. ఇక ఇంటిసభ్యులు కొన్ని డైలాగులను స్పూఫ్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఇందులో రేవంత్ ఎవడు కొడిడే మైండ్ బ్లాంక్ అయితుందో వాడే పండుగాడు అంటూ డైలాగ్ చెప్పగా, తమిళేంటి, తెలుగేంటి డార్లింగ్.. గొడవైంది కొట్టేసుకుందాం రా అంటూ గీతూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది. ఇక ఆర్జే సూర్య, చలాకీ చంటీల మధ్య జరిగిన డిస్కషన్లో సూర్య అతనిపై సరదాగా చేయిచేసుకుంటాడు. మరోవైపు సత్యను ఫ్లర్ట్ చేయడానికి రాజ్ తెగ ట్రై చేశాడు. శారీలో బాగున్నావ్.. లెట్స్ గో ఫర్ ద డేట్ అని అందరి ముందే అడిగేశాడు. దీంతో సత్య ఈ డైలాగ్ ఎంతమందికి చెప్పావ్ అంటూ అతడి పరువు తీసేసింది. మరి ఇవాల్టి ఎపిసోడ్లో ఫన్ డోస్ ఎంత ఉందన్నది చూడాల్సి ఉంది. -
సుధీర్‌బాబు కొత్త సినిమా..ఆగస్టులో ప్రారంభం
‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలతో బిజీగా ఉన్న హీరో సుధీర్‌బాబు తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటుడు, రచయిత హర్షవర్థన్ ఈ చిత్రానికి దర్శకుడు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. -
మాస్ మాయలోడా...
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘1978 పలాస’ చిత్రదర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మందులోడా ఓరి మాయలోడా... మామ రారా మందుల సిన్నోడా..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ని హీరో చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘శ్రీదేవి సోడా సెంటర్’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాపై క్రేజ్ మొదలయ్యింది. అదే విధంగా మొదటి లుక్‌కి, గ్లింప్స్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ‘మందులోడా ఓరి మాయలోడా..’ పాటకి కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా, మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ పాట లిరికల్ వీడియోలో సుధీర్ బాబు వేసిన స్టెప్స్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్ సైనుద్దీన్. -
Krithi Shetty: ఆ సినిమాపై ఫోకస్ పెట్టిన కృతీ శెట్టి
గ్యాప్ లేకుండా పని చేసేవాళ్లకి లాక్డౌన్ పెద్ద విలన్‌గా మారింది. అయితే ఇటీవలే మెల్లి మెల్లిగా షూటింగులు ఆరంభమవుతున్నాయి. అందుకే ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి ఆనందంగా ఉన్నారు. తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ చిత్రీకరణలో నేటి నుంచి పాల్గొంటున్నారు కృతి. సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి ఈ సినిమా మీదే పెట్టాలనుకుంటున్నారు కృతి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అయ్యేలోపు ‘ఆ అమ్మాయి గురించి...’ చిత్రంతో బిజీగా ఉంటారు కృతి. -
‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేధా థామస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► కొత్త కంటñ ంట్‌తో వచ్చే సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం రావటం అదృçష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమాని థియేటర్లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. ఓటీటీ ఓ కొత్త ఎక్స్పీరియన్స్. నా ప్రతి సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 షోను కర్టెన్ పక్కన నిలబడి చూసేవాణ్ణి. అది మిస్ కాకూడదని థియేటర్ ఫీలింగ్ కోసం మా ఫ్యామిలీకి ఓ షో వేస్తున్నాను. ► ఇంద్రగంటిగారితో నా ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మా’ చేశాను. ఈ పన్నెండేళ్లలో నేను, ఆయన వ్యక్తిగతంగా కొంచెం కూడా మారలేదు. కానీ వృత్తిపర ంగా దర్శకునిగా ఇంద్రగంటిగారు, నటునిగా నేను, కెమెరామేన్‌గా విందా చాలా గొప్పగా ఎదిగాం అనిపించింది. ఈ ‘వి’ సినిమాకి హీరో ఇంద్రగంటిగారే. మా ‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవ్వటం అనుకోకుండా జరుగుతోంది. ► ‘వి’ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందనుకుంటున్నా (న వ్వుతూ). ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు బ్యాడ్బాయ్స్నే ఇష్టపడుతున్నారు. కావాలంటే చూడండి రానా, సోనూ సూద్‌లకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ‘వి’ కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. చాలామంది చివరికి వచ్చేసరికి నాని హీరో అవుతాడు, సుధీర్ విలనవుతాడని రాస్తున్నారు. అసలు అలాంటిదేం లేదు. లైఫ్ అంతా సాఫీగా నడుస్తోన్న ఒక సెలబ్రిటీ పోలీస్ లైఫ్‌లోకి ఒకడొచ్చాడు. ఇంతే సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ పాత్రలకు కనెక్ట్ అయి చిన్న ఎమోషన్ ఫీలవుతారు. ► ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను ఇలా (ఓటీటీలో) విడుదల చేస్తున్నందుకు ‘దిల్’ రాజుగారు చాలామందికి సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఓ డిస్ట్రిబ్యూటర్. రాజుగారూ.. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీతో పాటు మేమున్నాం అని నావైపు నుండి పూర్తిగా సపోర్ట్ చేశాను. నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవటం మన బాధ్యత. ► లాక్డౌన్ ముందు రాజమండ్రిలో 20 రోజులు, పళనిలో 15 రోజులు షూటింగ్ చేశాను. షూటింగ్ చేసొచ్చిన ప్రతిసారీ మా అబ్బాయి జున్ను కొత్తగా కనిపిస్తుంటాడు. త్వరగా పెరిగిపోతున్నాడే, ఇలాంటి క్యూట్ ఏజ్‌ను మిస్ అవుతున్నానే అనుకునేవాణ్ణి. ఈ లాక్డౌన్లో 24 గంటలూ వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ► నటులందరూ బాధ్యతగా ఉండి నిర్మాతకు డబ్బు రాకపోతే అసలు రూపాయి కూడా తీసుకోకుండా పని చేయొచ్చు. అంతేకానీ ఒక్కో నటునికి 20 శాతం, 30 శాతం కట్ చేయాలని చాంబర్ రూల్ పెట్టిందని కాకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అంతేకానీ ఈ సమస్యను జనరలైజ్ చెయ్యకూడదు. ► ‘టక్ జగదీష్’ సినిమా 50 శాతం పూర్తయింది. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ‘శ్యామ్‌సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘టక్ జగదీష్’ పూర్తవ్వగానే అది మొదలవుతుంది. మరో రెండు కథలు ఓకే చేశాను. ఒకటి కొత్త దర్శకుడు, మరోటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో చేస్తాను. ► జనరల్‌గా నేను ఫిట్నెస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టను కాబట్టి ఇప్పుడొచ్చిన గ్యాప్‌లో ఫుల్‌గా ఫిట్నెస్ పెంచుకుని సిక్స్‌ప్యాక్ చేద్దామనుకున్నాను. అలాగే పియానో నేర్చుకుందామనుకున్నాను. మా అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు. తినడం.. పడుకోవటం.. మా జున్నుతో ఆడుకోవటంతోనే ఆరు నెలలు గడిచిపోయాయి. -
ఆ గేమ్‌లోకి వెళ్లను
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నివేదా థామస్ చెప్పిన విశేషాలు. ► నిజానికి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్‌తో రెండో సినిమా, ‘దిల్’ రాజుగారి బేనర్లో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్ థ్రిల్లర్స్ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. ► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్‌లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్ టైమ్ గడుపుతున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్‌గా నాకు సూట్ అయ్యేవే ఎన్నుకుంటాను. ► వెబ్ సిరీస్‌లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. స్టార్డ్డమ్ అంటూ నంబర్ గేమ్‌లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్‌లో ఉండను. స్టార్డమ్ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
విడుదల వాయిదా
తన 25వ చిత్రాన్ని ఈ నెల 25న ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు నాని. అయితే ప్లాన్ మారింది. కరోనా వైరస్ కారణంగా ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడింది. నాని, సుధీర్‌బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. ఇది నాని కెరీర్లో 25వ సినిమా. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు నాని. ఉగాది రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మార్చిలో కరోనాను చంపేద్దాం. ఏప్రిల్ నెలలో ఉగాదిని జరుపుకుందాం’’ అని ట్వీట్ చేశారు నాని. -
పవర్ఫుల్ ఆఫీసర్
నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్‌బాబు. నాని నేచురల్ స్టార్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్‌బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్‌మేన్’ వంటి హిట్ చిత్రాలను, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని ఓ డిఫరెంట్ రోల్లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. సోమవారం సుధీర్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అమిత్ త్రివేది, కెమెరా: పి.జి.విందా. -
వేసవిలో సవారి
నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. నందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి బజ్ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్ (కోటి) వ్యూస్ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం పాల్గొన్నారు. -
అందమైన ఆకర్షణ
సుధీర్‌బాబు, బాలీవుడ్ నటి అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘సమ్మోహనం’ పేరు ఖరారు చేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘సమ్మోహనం’ అంటే మంత్రముగ్ధులని చేసే ఒక అందమైన ఆకర్షణ. ఒక మ్యాజికల్ ఎట్రాక్షన్. మా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య సమ్మోహనకరమైన రొమాన్స్‌తో పాటు ఇతర పాత్రలకి ఉండే విభిన్నమైన ఆకర్షణలు మెప్పిస్తాయి. ఓ కొత్త పోకడ ఉన్న నవతరం ప్రేమకథా చిత్రంగా ఉంటూనే హాస్యం, సజీవమైన కుటుంబ బంధాలతో ఉంటుంది’’ అన్నారు. ‘‘మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 22 నుంచి మార్చి 3 వరకు నాలుగో షెడ్యూల్ హైదరాబాద్‌లో, మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3 వరకూ హిమాచల్‌ప్రదేశ్, ముంబైలో షూటింగ్ చేస్తాం. మే మూడో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్. -
యంగ్ హీరో న్యూ ఇయర్ ప్లాన్స్
కొత్త ఏడాదిలో వరుస సినిమాలతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ ఏడాది తాను చేయబోయే సినిమాలను కూడా ప్రకటించాడు. గత ఏడాదిలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు సుధీర్. 2017లో రిలీజ్ అయిన శమంతకమణి సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన సుధీర్ బాబు ఈ పాత్ర ద్వారా తన తల్లి తనకు మరింత దగ్గరయ్యిందని తెలిపాడు. ఇక 2018లో తాను నాలుగు సినిమాలు చేయబోతున్నట్టుగా వెల్లడించాడు. జాతీయ అవార్డు పొందిన దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రవీణ్ సత్తారులతో సినిమాలు చేయనున్న సుధీర్ ఇంద్రసేన, ఆర్ఎస్ నాయుడు అనే కొత్త దర్శకులతోనూ సినిమాలు చేయనున్నాడు. అంతేకాదు ఈ ఏడాదిలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభిస్తున్నాడు. Finally can’t thank enough all my supporters & well wishers...thank you for being there next to me & hopefully you continue to do that in 2018🙏 wish you & your family a very #HappyNewYear 🤗🤗 — Sudheer Babu (@isudheerbabu) 1 January 2018 -
సుధీర్, ఇంద్రగంటిల ‘సమ్మోహనం’
సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబు, సక్సెస్ జోరు మీదున్న ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ త్వరలో మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు. సోలో హీరోగా మల్టీ స్టారర్ సినిమాలతో టాలీవుడ్ బిజీగా ఉన్న సుధీర్ బాబు.. బాలీవుడ్లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. హిందీలో ‘బాగీ’(తెలుగులో వర్షం సినిమా) సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. జెంటిల్ మన్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత గ్యాప్ తీసుకున్న ఇంద్రగంటి తరువాత సుధీర్ తో సినిమాను ప్రారంభించారు. మరోసారి ఒక అందమైన ప్రేమకథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘సమ్మోహనం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ పక్కింట అబ్బాయిలా, సరదాగా ఉండే పాత్రలో నటిస్తున్నారు. మణిరత్నం, కార్తీ కాంబినేషన్ లో రూపొందిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అదితిరావ్ హైదరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. -
సుధీర్‌కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్, తొలి సినిమా సాలా ఖద్దూస్ తోనే ఆకట్టుకున్నారు. తరువాత అదే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తున్నారు. గురు తరువాత ఎక్కువగా తమిళ చిత్రాలు మాత్రమే చేస్తు వచ్చిన రితికా డబ్బింగ్ సినిమాగా తెలుగు లో రిలీజ్ అయిన శివలింగాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలో ఈ బాక్సింగ్ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించనుందట. యంగ్ హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమాకు రితికా ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
నలుగురు హీరోలతో మల్టీ స్టారర్
టాలీవుడ్ యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో మరో యూత్ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేసిన సందీప్ కిషన్, నారా రోహిత్ తో పాటు సుదీర్ బాబు, ఆదిలు కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్.. బాలీవుడ్ లో విలన్ గా కూడా చేసొచ్చిన సుధీర్ బాబు.. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సాయి కుమార్ కొడుకు ఆది. ఈ నలుగురు ఇప్పుడు ఒక సినిమాకు సైన్ చేశారట. సుదీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమాను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ నలుగురు హీరోల మల్టీ స్టారర్‌ను రూపొందిస్తుంది. ఇప్పటికే ఈ భారీ మల్టీ స్టారర్లో నటించేందుకు నలుగురు హీరోలు ఒకే చెప్పేశారు. మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
నాలుగు భాషల్లో గోపిచంద్ బయోపిక్
బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న బయోపిక్‌ల ఫీవర్ ఇప్పుడు సౌత్‌లో కూడా కనిపిస్తోంది. ఇటీవల ఒలిపింక్ మెడల్‌తో సత్తా చాటిన పివి సింధూ కోచ్, గోపిచంద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినా.. వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా గోపిచంద్‌కు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన యంగ్ హీరో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి రేవతి గోపిచంద్ తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ప్లాన్ చేసిన ప్రస్తుతం గోపి క్రేజ్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోకి డబ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇలా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోపిచంద్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.