సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ
సుధీర్‌బాబు, బాలీవుడ్ నటి అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘సమ్మోహనం’ పేరు ఖరారు చేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘సమ్మోహనం’ అంటే మంత్రముగ్ధులని చేసే ఒక అందమైన ఆకర్షణ. ఒక మ్యాజికల్ ఎట్రాక్షన్. మా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య సమ్మోహనకరమైన రొమాన్స్‌తో పాటు ఇతర పాత్రలకి ఉండే విభిన్నమైన ఆకర్షణలు మెప్పిస్తాయి.
ఓ కొత్త పోకడ ఉన్న నవతరం ప్రేమకథా చిత్రంగా ఉంటూనే హాస్యం, సజీవమైన కుటుంబ బంధాలతో ఉంటుంది’’ అన్నారు. ‘‘మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 22 నుంచి మార్చి 3 వరకు నాలుగో షెడ్యూల్ హైదరాబాద్‌లో, మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3 వరకూ హిమాచల్‌ప్రదేశ్, ముంబైలో షూటింగ్ చేస్తాం. మే మూడో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్.
Comments
Please login to add a commentAdd a comment