
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా మారారు. పలు హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన బృందా దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘హే సినామిక’ చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ గురువారం చెన్నైలో ప్రారంభమైంది. తొలి షాట్‌కు మణిరత్నం, కె భాగ్యరాజ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి సుహాసిని, కుష్బూలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు.. బృందాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా బృందాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం టైటిల్‌ను మణిరత్నం ఒకే కన్మణి(ఒకే బంగారం) సినిమాలోని హే సినామిక పాట పల్లవి నుంచి తీసుకున్నారు. ఈ చిత్రం ప్రారంభానికి సంబంధించిన ఫొటోలను దుల్కర్, అదితీలు ట్విటర్‌లో షేర్ చేశారు.



Comments
Please login to add a commentAdd a comment