'హే సినామిక' షూటింగ్‌ కంప్లీట్‌ | Kajal Aggarwal, Dulquer Salmaan Wraps Up Hey Sinamika | Sakshi
Sakshi News home page

'హే సినామిక'షూటింగ్‌ కంప్లీట్‌

Published Mon, Dec 28 2020 10:59 AM | Last Updated on Mon, Dec 28 2020 11:04 AM

Kajal Aggarwal, Dulquer Salmaan Wraps Up Hey Sinamika - Sakshi

'కౌన్‌ హో గయా' సినిమాలో చిన్న పాత్రలో నటించిన కాజల్‌ అగర్వాల్‌ తర్వాత 'లక్క్క్ష్మీ కళ్యాణం'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ్‌లో స్టార్‌ హీరోలందరి సరసన నటించింది. అగ్ర నటులతో పాటు యంగ్‌ హీరోలతోనూ నటించింది. తాజాగా ఆమె 'హే సినామిక' చిత్రంలో మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్యాన్స్‌ మాస్టర్‌ బృంద దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌ 26న ముగిసింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన చిత్రయూనిట్‌ సెట్స్‌లో తీసిన కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇక జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. ప్రస్తుతం కాజల్‌ చేతిలో చిరంజీవి 'ఆచార్య', కమల్‌ హాసన్‌ 'భారతీయుడు 2' ఉండగా రెండు హారర్‌ చిత్రాలు సైతం ఒప్పుకున్నారు. ఏదేమైనా పెళ్లయ్యాక కాజల్‌ మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. (చదవండి: అందరికీ ఒక్కడే దేవుడు!)

మరోవైపు ఈ మధ్యే ఫ్యాన్స్‌ 'కాజలిజం డే'ను క్రియేట్‌ చేసి నెట్టింట రచ్చరచ్చ చేశారు. దక్షిణాదిన ఓ హీరోయిన్‌ పేరిట ఇలా ఒక రోజు ఉండటం కాజల్‌కే చెల్లింది. అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు చందమామ ఉబ్బితబ్బిబైంది. మరోవైపు ఇటీవలే కాజల్‌ మైనపు బొమ్మను మేడమ్‌ టుస్సాడ్స్‌లో నెలకొల్పగా.. ఆ గౌరవం పొందిన తొలి సౌత్‌ హీరోయిన్‌గా కాజల్‌ రికార్డు నెలకొల్పింది. ఇక ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మిలిటరీ మ్యాన్‌గా కనిపించనున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఒకవేళ పూజా హెగ్డే ఈ సినిమా కమిట్‌ అయితే ఆమె మాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. (చదవండి: నా రూట్‌ హారర్‌ రూట్‌: కాజల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement