![Aditi Rao Hydari To Star Opposite Dulquer Salmaan In Titled Hey Sinamika - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/13/hey-sina.jpg.webp?itok=vuar9cC6)
అదితీ రావ్, కాజల్ అగర్వాల్డ్చ్, దుల్కర్ సల్మాన్
సీనియర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా దర్శకురాలిగా మారారు. ఆమె దర్శకత్వం వహించనున్న సినిమా ముహూర్తం గురువారం జరిగింది. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో బృందా దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ చిత్రం ‘హే సినామికా’. రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా జియో స్టూడియోస్ సంస్థ కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ‘హే సినామికా’ టైటిల్‌ను మణిరత్నం – దుల్కర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం)లో ‘హే సినామికా...’ పాట నుంచి తీసుకున్నారట.
Comments
Please login to add a commentAdd a comment