Alamelu Manga Venkataramana Movie Update: తేజ కొత్త సినిమా.. అలిమేలు ఆవిడే! - Sakshi
Sakshi News home page

తేజ కొత్త సినిమా.. అలిమేలు ఆవిడే!

Published Tue, Jan 19 2021 8:47 AM | Last Updated on Tue, Jan 19 2021 10:45 AM

Sai Pallavi Act In Director Teja New Movie - Sakshi

‘జయం’, ‘నిజం’ సినిమాల్లో గోపీచంద్‌లోని విలన్‌ యాంగిల్‌ని బాగా చూపించారు దర్శకుడు తేజ. చాలా గ్యాప్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘అలిమేలు మంగ వెంకటరమణ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో గోపీచంద్‌ హీరోగా నటించనున్నారు. ఇందులో అలిమేలుగా కాజల్‌ అగర్వాల్, కీర్తీ సురేశ్, తాప్సీ పేర్లను పరిశీలిస్తున్నారనే వార్త వచ్చింది. తాజాగా అలిమేలు ఆవిడే అంటూ సాయి పల్లవి పేరు బయటికొచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మరి... అలిమేలు ఆవిడేనా అనేది అప్పుడు తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement