ఏజెంట్ టీనాని గుర్తుచేసిన కాజల్.. కొత్త సినిమాలో అలా! | Kajal Aggarwal Satyabhama Movie Video | Sakshi
Sakshi News home page

Kajal New Movie: కాజల్ యాక్షన్.. పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీలో!

Jun 19 2023 1:46 PM | Updated on Jun 19 2023 1:52 PM

Kajal Aggarwal Satyabhama Movie Video - Sakshi

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. పెళ్లి తర్వాత ఆమె నటిస్తుందా లేదా అనే రూమర్స్ కి చెక్ పెడుతూ కొత్త సినిమాల్లో వరసగా నటిస్తూ వెళ్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందాలు.. పోస్టర్, టీజర్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఓ సినిమా టైటిల్ గ్లింప్స్ లో అయితే కాజల్ ని వేరే లెవల్ లో చూపించారు. చెప్పాలంటే విక్రమ్ మూవీలోని టీనా పాత్రధారి గుర్తొచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)

తెలుగు హీరోయిన్లలో విజయవంతమైన వాళ్ల లిస్ట్ తీస్తే.. అందులో కాజల్ అగర్వాల్ పేరు కచ్చితంగా ఉంటుంది. 'లక్ష‍్మీ కల్యాణం' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. 'మగధీర'తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా 50కి పైగా సినిమాలు చేసింది. అయితే లాక్ డౌన్ లో ఆమె పెళ్లి చేసుకోవడం.. ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బిడ్డకు జన్మనిచ్చింది.

ఇలా వరసగా షాకుల మీద షాకుల తగిలేసరికి కాజల్ ఇక నటించదేమోనని అభిమానులు భావించారు. కానీ కాజల్ మాత్రం బాలకృష్ణతో 'భగవంత్ కేసరి'లో నటిస్తోంది. ఈమె లీడ్ రోల్ చేస్తున్న మరో కొత్త చిత్రానికి 'సత్యభామ' టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఈమె పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించింది. టీజర్ లోని ఓ సీన్ లో జుత్తు ముడి వేసుకుంటుంటే.. 'విక్రమ్'లోని ఏజెంట్ టీనా రోల్ గుర్తొచ్చింది. మరి మీలో కూడా ఎవరికైనా అలా అనిపించిందా?

(ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement