విడుదల వాయిదా | Nani V Movie Release Postponed | Sakshi
Sakshi News home page

విడుదల వాయిదా

Mar 15 2020 5:25 AM | Updated on Mar 15 2020 5:25 AM

Nani V Movie Release Postponed - Sakshi

నాని

తన 25వ చిత్రాన్ని ఈ నెల 25న ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు నాని. అయితే ప్లాన్‌ మారింది. కరోనా వైరస్‌ కారణంగా ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడింది. నాని, సుధీర్‌బాబు, అదితీ రావ్‌ హైదరీ, నివేదా థామస్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’.  మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఇది నాని కెరీర్‌లో 25వ సినిమా. ఈ సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు నాని. ఉగాది రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మార్చిలో కరోనాను చంపేద్దాం. ఏప్రిల్‌ నెలలో ఉగాదిని జరుపుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు నాని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement