గ్యాప్ లేకుండా పని చేసేవాళ్లకి లాక్‌డౌన్ పెద్ద విలన్‌గా మారింది. అయితే ఇటీవలే మెల్లి మెల్లిగా షూటింగులు ఆరంభమవుతున్నాయి. అందుకే ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి ఆనందంగా ఉన్నారు. తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ చిత్రీకరణలో నేటి నుంచి పాల్గొంటున్నారు కృతి. సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి ఈ సినిమా మీదే పెట్టాలనుకుంటున్నారు కృతి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అయ్యేలోపు ‘ఆ అమ్మాయి గురించి...’ చిత్రంతో బిజీగా ఉంటారు కృతి.
Comments
Please login to add a commentAdd a comment