నాలుగు భాషల్లో గోపిచంద్ బయోపిక్
నాలుగు భాషల్లో గోపిచంద్ బయోపిక్
Published Sun, Oct 2 2016 1:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న బయోపిక్ల ఫీవర్ ఇప్పుడు సౌత్లో కూడా కనిపిస్తోంది. ఇటీవల ఒలిపింక్ మెడల్తో సత్తా చాటిన పివి సింధూ కోచ్, గోపిచంద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినా.. వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా గోపిచంద్కు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు.
స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన యంగ్ హీరో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి రేవతి గోపిచంద్ తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ప్లాన్ చేసిన ప్రస్తుతం గోపి క్రేజ్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోకి డబ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇలా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోపిచంద్ బయోపిక్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Advertisement
Advertisement