సుధీర్కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ | Ritika singh okayed her second telugu film with Sudeer Babu | Sakshi
Sakshi News home page

సుధీర్కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ

Published Thu, Aug 31 2017 2:00 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

సుధీర్కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ

సుధీర్కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్, తొలి సినిమా సాలా ఖద్దూస్ తోనే ఆకట్టుకున్నారు. తరువాత అదే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తున్నారు. గురు తరువాత ఎక్కువగా తమిళ చిత్రాలు మాత్రమే చేస్తు వచ్చిన రితికా డబ్బింగ్ సినిమాగా తెలుగు లో రిలీజ్ అయిన శివలింగాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

త్వరలో ఈ బాక్సింగ్ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించనుందట. యంగ్ హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమాకు రితికా ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement