
శ్యామ్‌దత్, సుధీర్ బాబు, చిరంజీవి, కరుణకుమార్, విజయ్
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘1978 పలాస’ చిత్రదర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మందులోడా ఓరి మాయలోడా... మామ రారా మందుల సిన్నోడా..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ని హీరో చిరంజీవి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘శ్రీదేవి సోడా సెంటర్’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాపై క్రేజ్ మొదలయ్యింది. అదే విధంగా మొదటి లుక్‌కి, గ్లింప్స్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ‘మందులోడా ఓరి మాయలోడా..’ పాటకి కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా, మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ పాట లిరికల్ వీడియోలో సుధీర్ బాబు వేసిన స్టెప్స్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్ సైనుద్దీన్.
Comments
Please login to add a commentAdd a comment