ఘట్టమనేని ఫ్యామిలీ హీరోల్లో మహేష్ తరువాత క్రేజ్ తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. అందుకు తగ్గట్టుగా సుధీర్ బాబు కూడా ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కుతూ హిట్స్, ఫ్లాప్స్‌కి అతీతంగా కెరీర్ సాగిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథా చిత్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేసిన సుధీర్ బాబు, ఆ తరువాత చాలా సెలెక్టివ్ గా ఉంటూ మంచి హిట్స్ సాధించాడు.
స్టార్‌గా కన్న నటుడిగా మంచి మార్కులు సాధించి క్రియేటివ్ డైరెక్టర్స్ అంటూ తమకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఇంద్రగంటి, చంద్రశేఖర్ యేలేటి కృష్ణవంశీ వంటి దర్శకులు దృష్టిని ఆకర్షించడంలో సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడు. అలా ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సమ్మోహనం సుపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసిన సుధీర్ బాబు, అదే ఊపులో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి నన్నుదోచుకుందువటే అనే చిత్రాన్ని తీసి ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. అలానే బాడీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న సుధీర్ బాబు, బాలీవుడ్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నారు.
బాలీవుడ్ మూవీ భాగీలో విలన్‌గా నటించిన ఈ తెలుగు హీరోకి ఇప్పుడు నార్త్ నుంచి కూడా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుధీర్ బాబు, దాంతో పాటే తెలుగు నాట నానితో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. వీరిద్దరిలో కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వి’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు.
సుధీర్ బాబు ఇమేజ్ బ్యారియర్స్‌లో ఉండిపోకుండా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తుండటంతో క్రియేటివ్ థాట్స్‌తో వచ్చే డైరెక్టర్స్ బెస్ట్ చాయిస్ అన్న పేరు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్న గోపిచంద్ బయోపిక్, వి సినిమాలు మంచి విజయం సాధిస్తే కమర్షియల్‌గానూ తన మార్కెట్‌ను మరింత పెరుగుతుందంటున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment