మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు | nani to release gentelman movie on balakrishnas birthday | Sakshi
Sakshi News home page

మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు

Published Wed, May 18 2016 8:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు - Sakshi

మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి ఫాంలో ఉన్న నటుడు నాని. కెరీర్ స్టార్టింగ్లో కాస్త తడబడినా ప్రస్తుతం ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, తన అభిమానులతో పాటు భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య అభిమానులను కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో తన చేతి మీద జై బాలయ్య అనే టాటూతో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు.

కృష్ణగాడి వీర ప్రేమగాథ విషయంలో జై బాలయ్య ప్లాన్ బాగా వర్కవుట్ కావటంతో మరోసారి బాలయ్య అభిమానులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు నాని. అందుకే తన నెక్ట్స్ సినిమా జెంటిల్మేన్ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రిలీజ్ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండోసారి బాలయ్య ఫ్యాన్స్ను టార్గెట్ చేసిన నాని ఈసారి కూడా మెప్పిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement