Gentelman
-
జెంటిల్మెన్లా ఉండాలనుకుంటే..అవి అస్సలు చేయకూడదు!
పరస్తుతి, పరనింద, ఆత్మస్తుతి, ఆత్మనింద – ఈ నాలుగూ సజ్జనులు చేసే పనులు కావు అని మహాభారతంలో ఒక నీతి ఉంది. ‘అన్య కీర్తనంబు, అన్య నిందయు, తన్ను/ పరగ పొగడికోలు, ప్రబ్బికోలు,/ ఆపగా తనూజ! ఆర్యవృత్తములు కా/వనిరి వీని ఆద్యులైన మునులు...’ ఇక్కడ ‘ఆపగా తనూజుడు’ (నదీ పుత్రుడు) అంటే గాంగేయుడైన భీష్ముడు. ఆ ధర్మవేత్తకు ఈ నీతి బోధిస్తున్నది ఛేదిరాజు శిశుపాలుడు. ‘నువ్వు అదే పనిగా శ్రీకృష్ణుడినే పొగుడు తున్నావు. ఇది పెద్దలు చేయదగిన పనికాదు’ అని శిశుపాలుడి అభ్యంతరం. ఉటంకించింది శిశుపాలుడయినా, ఇది ‘ఆద్యులైన మునుల’ మాట కదా! పెద్దలిలా ఎందుకు చెప్పారో ఇంచుక చింతన చేసుకొంటే తప్పులేదు. పరులను వాళ్ళ ఎదుటే ‘ముఖస్తుతి’ చేసే వాడు... పలచనైపోయి, ఆశ్రితుల స్థాయికి జారిపోతాడు. గౌరవం కోల్పోతాడు. పరులను వాళ్ళ పరోక్షంలో పొగిడినా, అలా పదేపదే చేస్తుంటే... దానివల్ల తనవాళ్ళకు నిరుత్సాహం కలగడమే కాక, వాళ్ళు దాన్ని పరి పరి విధాలుగా అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది. అలాగే పరనింద కూడా ప్రయోజన శూన్యం. అహంకారాన్ని ప్రకటించుకోవడమూ, శత్రుత్వాన్ని పెంచుకోవడమూ తప్ప నింద వల్ల సాధించేదేముంది? నిందను సకారాత్మకంగా స్వీకరించి, తమ ‘తప్పు’ గ్రహించి మారిపోయే ‘పరులు’ ఎక్కడయినా ఉంటారా? చేతలే చెప్తాయి.. ఆత్మస్తుతి సరేసరి. అది సాధారణంగా అల్పత్వాన్నీ, ఆత్మ న్యూనతా భావాన్నీ సూచిస్తుంది. ధీరులూ, సమర్థులూ వాళ్ళ ఘనత వాళ్ళు చెప్పుకోరు. ఘనతను చేతలే చెప్తాయి. చేతలులోపించి నప్పుడే మాటలు. ‘నేను ఘనుడిని’ అని ఎంత చెప్పుకొన్నా దానికి విలువా, విశ్వసనీయతా ఉండవు. నమ్మేదెవరు? ఆత్మనింద కూడా ప్రమాదకరమే. ఆత్మవిమర్శతో తన తప్పులు గ్రహించుకొని, తొలగించుకొంటే మంచిదే కానీ ఊరకే తనను తాను నిందించుకొంటూ కూర్చొంటే, అది ఉన్న ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కూడా దెబ్బ తీసి, క్రమంగా మరింత పిరికితనానికీ, అసమర్థతకూ, కుంగుబాటుకూ దారి తీస్తుంది. అయితే ఒకటి! మహాభారతమయితే ఇలా చెప్పింది కానీ ఈ రోజులలో, ఆత్మస్తుతీ, పరనిందా, దాంతోపాటు అవసరార్థం ‘తమంత వారు లేరు సుమా!’ అంటూ పరస్తుతీ, లోకం చేత ఓహో అనిపించుకొనేందుకు అప్పుడప్పుడూ ఆత్మనిందా మానేస్తే, సమా జంలో ఎక్కువగా మౌనమే రాజ్యం చేయాల్సివస్తుందేమో! – ఎం. మారుతి శాస్త్రి (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
జెంటిల్‌మేన్ వల్ల రెస్పెక్ట్ వచ్చింది
‘జెంటిల్మెన్’ సినిమా గురించి అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి ముందు నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో ఆ సినిమాను ‘రౌడీ పోలీస్’ పేరుతో రిలీజ్ చేశాం. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా నేనే చేసుకున్నాను. ఆ సినిమా విజయంతో మళ్లీ నేను మంచి పొజిషన్‌కు వచ్చాను. అంతకుముందు నేను చేసిన సినిమాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాను. అప్పుడు నేను చేసిన అప్పుల వల్ల నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఆ బాధలో ఉండి, ఇండస్ట్రీలోని ఎవ్వరినీ కలవటానికి ఇష్టపడలేదు. అప్పుడు శంకర్ నా దగ్గరికి ఓ కథ తీసుకుని వచ్చారు. ఆయన పదిసార్లు నా దగ్గరికి వచ్చినా నేను వినటానికి ఇష్టపడలేదు. ఫైనల్‌గా ఓ రోజు శంకర్ మా ఇంటికి వచ్చి ‘సార్ మీరు సినిమా చెయ్యొద్దు. కానీ ఓ సారి నా సినిమా కథ వినండి’ అన్నారు. అప్పుడు ‘జెంటిల్‌మేన్’ కథ విన్నాను. కథ విన్న వెంటనే ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అంతా పోయింది. కథ చెప్పేటప్పుడే చిన్న చిన్న డిటెయిల్స్ కూడా చెప్పారు. అయితే కొత్త దర్శకుడు సినిమా ఎలా తీస్తాడో అనే అనుమానం ఉండేది. కానీ శంకర్ ఒక విషయంలో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైమ్‌లో నా మార్కెట్‌కంటే మరో రెండు రెట్లు అదనంగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు చిత్రనిర్మాత కుంజుమోన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు కుంజుమోన్ ‘నువ్వు స్టేట్ అవార్డ్ దక్కించుకుంటావు’ అనేవారు. అది నిజమైంది. నాకైతే ‘జెంటిల్‌మేన్’ వచ్చి 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ నటిస్తున్నానంటే కారణం హార్డ్‌వర్క్. అలాగే మన బిహేవియర్లో భయం, బాధ్యత ఉండాలి. ఇక్కడ భయం అంటే నా ఉద్దేశం.. ప్రొడ్యూసర్ మనపై డబ్బు పెట్టాలి అంటే, జనం మనకోసం టిక్కెట్ కొనుక్కుని వస్తున్నారంటే మనం చాలా భయంగా ఉండాల్సిందే. ఆ భయమే మనకు శ్రీరామరక్ష. ‘జెంటిల్‌మేన్’ సినిమా వల్ల డబ్బు కాదు.. రెస్పెక్ట్ వచ్చింది’’ అన్నారు. -
మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి ఫాంలో ఉన్న నటుడు నాని. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా ప్రస్తుతం ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, తన అభిమానులతో పాటు భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య అభిమానులను కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో తన చేతి మీద జై బాలయ్య అనే టాటూతో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ విషయంలో జై బాలయ్య ప్లాన్ బాగా వర్కవుట్ కావటంతో మరోసారి బాలయ్య అభిమానులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు నాని. అందుకే తన నెక్ట్స్ సినిమా జెంటిల్మేన్ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రిలీజ్ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండోసారి బాలయ్య ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన నాని ఈసారి కూడా మెప్పిస్తాడేమో చూడాలి. -
గీత స్మరణం: మావేలే మావేలే
పల్లవి : ఆమె: మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మళ్లీ రాదు బృందం: వారెవ్వా బాబయ్య ॥ మావేలే॥ చరణం : 1 ఆ: పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు బృం: చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ ఆ: చిలకే ఎగిరొస్తే విదిలించుకోవద్దు బృం: రావొద్దూ రావొద్దూ మళ్లీ మళ్లీ రావొద్దు ఆ: పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు పడుచుకి పూవందం మరిచిపోవద్దు లక్షలు అడిగేనా లగ్నం నేనడిగేను ముహూర్తం పెట్టించు రేపో మాపో ॥ మావేలే॥ చరణం : 2 ఆ: పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు బృం: పెట్టొద్దూ పెట్టొద్దూ కొత్త రూలు పెట్టొద్దూ ఆ: కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దూ బృం: పాడొద్దు పాడొద్దు హద్దుమీరి పాడొద్దు చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే దొరకీ దొరకనట్టు జారుకోవద్దూ పగ్గం వెయ్యెద్దు పరువాలకిక ముందు అనుభవించాలి నేడే నేడే ॥ మావేలే॥ గానం : మిన్మిని, బృందం పల్లవి : చికు బుకు చికు బుకు రైలే అదిరెను దీని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే ॥ చికు॥ దీని చూపుకు లేదు ఏ భాషా కళ్లలోనే ఉంది నిషా ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును శోష ॥ చికు॥ చరణం : 1అహ... సైకిలెక్కి మేం వస్తుంటే మీరు మోటర్ బైకులే చూస్తారు అహ... మోటర్ బైకులో మేం వస్తుంటే మీరు మారుతీలు వెతికేరు అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వస్తే మీరు బ్యాగి ప్యాంట్సుకై చూస్తారు అహ... బ్యాగి ప్యాంట్సుతో మేం వస్తే మీరు పంచలొంక చూస్తారు మీకు ఏవి కావాలో మారు అర్థం కాలేదే పూలబాణాలేశామే పిచ్చివాళ్లయి పోయామే ॥ చికు॥ చరణం : 2 మాకు ఆటపాటలో అలుపొచ్చే మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే మా మతులు చెదిరి తల నెరుపొచ్చే రాదులే వయసు మళ్లీ మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు రేపిచ్చుకోవాలి కట్నాలు అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు మీరు ఇపుడే లవ్‌చేస్తే మూడుముళ్లు పడనిస్తే కన్నవాళ్లకు అది మేలు చిన్నవాళ్లకు హ్యాపీలు ॥ చికు॥ చిత్రం : జెంటిల్‌మేన్ (1993), రచన : రాజశ్రీ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, గానం : సురేష్ పీటర్ - నిర్వహణ: నాగేష్