పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ | naga chitanyas next likely to be pushed to september | Sakshi
Sakshi News home page

పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ

Published Wed, Jul 6 2016 1:34 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ - Sakshi

పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ

యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మళయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.

చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటీ మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. దీంతో ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement