![No Clarity On Shruti Hassan in Sye Raa narasimha Reddy Movie - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/03/13/sruthi.jpg.webp?itok=51BIxpnj)
సినిమా: ‘సైరా’లో శ్రుతి ఉంటుందా? ఇప్పుడిదే ఆసక్తిగా మారిన విషయం. సైరా అనగానే చాలా మందికి అర్థమై ఉంటుంది. అవును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత భారీ చిత్రం సైనా నరసింహారెడ్డి. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నటుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాహుబలి తరువాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులు పలువురు నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్ రైజింగ్‌స్టార్ విజయ్‌సేతుపతి వంటి వారు సైరాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అగ్రనటి నయనతార చిరంజీవికి జంటగా రాణి పాత్రలో నటిస్తుండగా, మిల్కీబ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా సంచలన నటి శ్రుతిహాసన్ కూడా మరో ముఖ్య పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. శ్రుతిహాసన్ దక్షిణాదిలో నటించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. తండ్రి కమలహాసన్‌తో కలిసి నటించిన శభాష్‌నాయుడు మధ్యలోనే ఆగిపోయింది. అది పూర్తి అవుతుందనే నమ్మకం లేదు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బుల్లితెరపైనా రియాలిటీషో చేస్తోంది. ఇక తనకు చాలా ఇష్టం అయిన సంగీత రంగంలో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. అలాంటిది సైరానరసింహారెడ్డి చిత్రంలో నటించడానికి సై అంటుందా అన్నది ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment