మ్యూజికల్‌ హిట్‌ ఇచ్చిన అనిరుధ్‌ ఫస్ట్‌ సినిమా రీ-రిలీజ్‌ | Danush 3 Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

మ్యూజికల్‌ హిట్‌ ఇచ్చిన అనిరుధ్‌ ఫస్ట్‌ సినిమా రీ-రిలీజ్‌

Published Thu, Aug 15 2024 4:55 PM | Last Updated on Thu, Aug 15 2024 5:48 PM

Danush 3 Movie Release Date Locked

ధనుష్, శ్రుతీహాసన్‌ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ధనుష్ సరసన శ్రుతి హాసన్ నటించింది. 2012లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ​ అయిన 'త్రీ' సినిమా ఇప్పుడు మరోసారి భారతదేశం అంతటా థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా మేకర్స్‌ ఉన్నారు. ధనుష్ దర్శకత్వం వహించి, అనిరుధ్ రవిచందర్ సంగీత అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రం రామ్ (ధనుష్), జనని (శృతి హాసన్) తమ పాఠశాల రోజుల్లో ప్రేమలో పడటం నుంచి కథ ప్రారంభమవుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ, రామ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది, అతని అకాల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి జనని ఏం చేసిందనేది కథ. ఎంతో థ్రిల్లింగ్‌ ఇచ్చే ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూడొచ్చు.

ఈ సినిమాతో అరంగేట్రం చేసిన అనిరుధ్ రవిచందర్ సంగీతం 3 సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సౌండ్‌ట్రాక్, ముఖ్యంగా ధనుష్ రచించి పాడిన వై దిస్ కొలవెరి డి పాట  సంచలనంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement