
‘‘మహిళలకు గౌరవం లభించడం లేదంటే నేను ఒప్పుకోను. కొన్ని చోట్ల వాళ్లకు అవమానాలు ఎదురవుతున్న విషయం వాస్తవమే. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు గౌరవం పెరిగింది. మగవాళ్లకు సమానంగా దూసుకెళుతున్నారు. అనుకున్నది సాధిస్తున్నారు. అందుకే ప్రస్తుత సమాజంలో గౌరవం పెరిగింది. ఇతర వృత్తుల్లో నిరూపించుకున్న మహిళలను ఎలా గౌరవిస్తున్నారో సినిమా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుంటున్నవారినీ అలానే గౌరవించాలి. సినిమా వాళ్లు అని చిన్నచూపు చూడొద్దు’’ అంటున్నారు శ్రుతీహాసన్.
అమెరికాలో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో కమల్, శ్రుతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను హీరోయిన్ అయి దాదాపు పదేళ్లవుతోంది. ఈ జర్నీలో నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో ఉమెన్‌కి సేఫ్టీ ఉంది’’ అన్నారు. ప్రస్తుతం హిందీ చిత్రంలో నటిస్తున్నానని, అది పూర్తి కాగానే తండ్రి కమల్‌హాసన్ కాంబినేషన్‌లో మొదలై, తాత్కాలిక బ్రేక్ పడిన ‘శభాష్ నాయుడు’ షూటింగ్ ఆరంభిస్తామని శ్రుతీహాసన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment