
శ్రుతిహాసన్ సౌతిండియన్ సినీ పరిశ్రమలో హాట్ అన్డ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగు, తమిళ సినిమాలతో నిరంతరం బిజీగా ఉంటారామె. ఎప్పుడైనా ఈ భారీ సినిమాల మధ్య కాస్త సమయం దొరికితే ఆ సమయంలో శ్రుతిహాసన్ ఏం చేస్తారో తెల్సా? చక్కగా బ్యాగు సర్దుకొని లండన్‌లో వాలిపోతారు. లండన్ అంతా తిరిగేస్తారు. అంతిష్టం శ్రుతిహాసన్‌కు లండన్ అంటే! మరి అంత ఇష్టం ఉన్నప్పుడు, లండన్‌లో ఉంటూ అక్కడ తిరగడమన్నది తనకు అంత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు దానికో పేరు పెట్టుకోవాలి కదా అని శ్రుతి బాగా ఆలోచించి ఆలోచించి ‘లండనింగ్’ అని పేరు పెట్టుకున్నారు.
ఇలాంటి పదం డిక్షనరీలో ఎక్కడా కనిపించదు. శ్రుతి తనకు లండన్‌పై ఉన్న ప్రేమను చెప్పేందుకు పెట్టుకున్న, కనిపెట్టుకున్న పదం అది. అక్కడే ఆమె ఒక లండన్ బేస్డ్ నటుడ్ని కలుసుకుందని, అతనితో ప్రేమలో ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రుతి దీని గురించి ఇప్పటికింకా బయటైతే ఏమీ చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment