అబ్బీయా? హబ్బీయా? | special story to heroines marraiges | Sakshi
Sakshi News home page

అబ్బీయా? హబ్బీయా?

Published Thu, Mar 22 2018 12:01 AM | Last Updated on Thu, Mar 22 2018 12:01 AM

special story to heroines marraiges - Sakshi

మనం వర్కవుట్‌ కావడం లేదు. దేనికండీ వర్కవుట్‌ కాందీ?!ఏడడుగులకు. మరి హీరోయిన్‌లకు ఏం కావాలట?సెవెన్‌స్టెప్స్‌ వెయ్యాలంటేసెవెన్‌ ‘సీ’స్‌ అవతలికి వెళ్లాల్సిందేనట!తెలుక్కి ఫారిన్‌ అయిన ముంబై, ఢిల్లీ..చండీఘర్, గోవా, కేరళ.. ఇలా..అన్ని ప్రదేశాల నుంచీ మనం... హీరోయిన్‌లను తెచ్చుకుంటే..వేరే దేశాల వాళ్లను వీళ్లు భర్తలుగా తెచ్చుకుంటున్నారు!అబ్బీలు వద్దు.. హబ్బీలు కావాలంటున్నారు. ఇదండీ.. ఫారిన్‌ మొగుళ్ల కథ. 

పిజ్జాకీ పరాటాకీ ఫ్రెండ్‌షిప్‌ కుదిరిందిసూట్‌కీ పట్టుచీరకీ లెక్క కుదిరిందివాటమ్మా వాటీస్‌ దిస్సమ్మా అనుకుంటున్నారా?అవును మరి.. నువ్వా దరి నేనీ దరి..గుండె చెదిరి.. దేశీ గాళ్స్‌ విదేశీ బాయ్స్‌తో లవ్‌లో పడుతున్నారు.ఇప్పుడు పిజ్జా మనదైపోయింది.. పరాటా వాళ్లదైపోయిందిఇక్కడి వంటకాలు వాళ్లకూ వాళ్ల వంటకాలు మనకూ..ఇక్కడి ఆచారాలు వాళ్లకూ.. అక్కడ ఆచారాలూ మనకూ అలవాటైపోతున్నాయ్‌
హద్దులు చెరిగిపోతున్నాయ్‌..అంతా ప్రే‘మాయ’ణం చేసిన మేజిక్‌. మొన్న విదేశీ అబ్బాయ్‌ ఆండ్రీ కోశ్చివ్‌ని శ్రియ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇంకా విదేశీయులతో లవ్‌లో మన తారలు, ఆల్రెడీ పెళ్లాడిన జంటల గురించి సరదాగా చెప్పుకుందాం.

మన ఇల్లూ (ఇలియానా) బేబీ పుట్టింది గోవా. పెరిగింది ముంబైలో. స్టార్‌ అయింది తెలుగులో. ఇక్కణ్ణుంచి హిందీకి వెళ్లి అక్కడా హీరోయిన్‌గా రన్‌ మొదలుపెట్టింది. నార్త్‌ టు సౌత్‌ ఈ బ్యూటీ జర్నీ జోరుగానే ఉంది. అంతేనా? ఈ జర్నీ ఇప్పుడు ఫారిన్‌ వరకూ వెళ్లింది. ఇది ఏడడుగుల జర్నీ. ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆండ్రూ నాకు వెరీ స్పెషల్‌’ అని పలు సందర్భాల్లో పేర్కొన్న ఇలియానా ఆ మధ్య ‘హబ్బీ..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. అంటే.. భర్త అన్నమాట. మూడు ముళ్లు పడిన సంగతి మాత్రం బయటపెట్టడంలేదు. ఏమైనా.. ఈ ఇద్దరూ ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నారు. 

ఇలియానా తర్వాత ఆ రేంజ్‌లో లవ్‌ న్యూస్‌లో ఉన్న మరో బ్యూటీ తాప్సీ. అదేంటో కానీ.. ఈ ముద్దుగుమ్మ లైఫ్‌ రెండు మూడేళ్లుగా స్పోర్ట్స్‌ చుట్టూ తిరుగుతోంది. ‘వన్‌ లవ్‌’ అంటోంది. అవును మరి.. తాప్సీ లవ్‌లో పడింది డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో కదా. పైగా తాప్సీ ‘సూర్మ’ అనే సినిమాలో హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. స్పోర్ట్స్‌తో అలా లంకె కుదిరింది. ‘మథియాస్‌ బో నాకు చాలా కావల్సినవాడు’ అని కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు తాప్సీ. ఈ ఇద్దరి మధ్య స్ట్రాంగ్‌ రిలేషప్‌షిప్‌ ఉందని టాక్‌. ఇలా విదేశీ స్పోర్ట్స్‌మేన్‌తో లవ్‌లో పడితే పాపం.. మనవాళ్లు ఏం కాను? అనుకోవడానికి కాలేదు. దేశీ భామ అనుష్క శర్మ ప్రేమించింది దేశీ స్పోర్ట్స్‌మేన్‌ విరాట్‌ కోహ్లీనే కదా. 

తాప్సీ, ఇలియానా,.. ఈ ఇద్దరి తర్వాత ఈ మధ్య ఫ్రెష్‌గా విదేశీ లవ్‌ క్లబ్‌లో చేరిన భామ శ్రుతీహాసన్‌. పాప పట్టుచీర బ్యాచ్‌. లవ్‌లో పడింది సూట్‌ బ్యాచ్‌తో. లండన్‌కి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖేల్‌ కోర్సలేతో లవ్‌లో ఉన్నారు శ్రుతీహాసన్‌. ‘అవును లవ్‌లో ఉన్నా’ అని ఆమె చెప్పకపోయినా ఆ మధ్య ఓ పెళ్లికి మైఖేల్‌తో కలిసి శ్రుతివెళ్లడం, సూట్‌ వేసుకోవాల్సిన మైఖేల్‌ అచ్చ తమిళ పంచె కట్టుతో హాజరు కావడం, పింక్‌ కలర్‌ పట్టుచీరలో శ్రుతీహాన్‌ అతని పక్కనే మెరవడం.. నో డౌట్‌ సూట్‌కీ పట్టుచీరకీ జోడీ కుదిరిందని పించాయి. తండ్రి కమల్‌హాసన్‌కీ, తల్లి సారికకూ మైఖేల్‌ని పరిచయం చేశారు కూడా. మైఖేల్, శ్రుతి, సారిక కొన్ని ఫొటోల్లో కనిపించగా, పెళ్లి వేడుకలో కమల్, శ్రుతి, మైఖేల్‌ ఒకే వరసలో పక్కపక్కన కూర్చుని ఉండటం గమనార్హం. అలాగే శ్రుతీ రీసెంట్‌ బర్త్‌డేని బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి జరుపుకోవటం కోసం లండన్‌ వరకూ వెళ్లింది.

ఆయన ‘నా భర్త కాదు’... సిరిల్‌ ఆక్సెన్‌ఫ్యాన్స్‌ గురించి హాట్‌ గాళ్‌ మల్లికా శెరావత్‌ కొన్నాళ్ల క్రితం ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది. ఫ్రెంచ్‌ టైకూన్‌ సిరిల్‌తో తన ప్రేమను, పెళ్లిని మల్లిక ఓపెన్‌గా ఒప్పుకోవడానికి ఇష్టడపటంలేదు. అయితే ఈ ఇద్దరి తీరు మాత్రం ‘సమ్‌థింగ్‌’ ఉందనే ఫీలింగ్‌ చాలామందికి కలిగించింది. ఏమీ లేకపోతే మల్లికాతో కలసి సిరిల్‌ ముంబై ఎందుకొస్తాడు? ప్యారిస్‌లో ఈ ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఎందుకు ఉంటారు? పైగా ఈ జంట ఉంటున్న అపార్ట్‌మెంట్‌ అద్దె (60 లక్షలు) సరిగ్గా కట్టకపోతే యజమాని కోర్టుకు ఈడ్చాడు కూడా. అప్పుడు మాత్రం అసలు ఆ అపార్ట్‌మెంట్‌ గురించి నాకేం తెలియదని మల్లికా అంది కానీ సిరిల్‌ ‘మంచి ఫ్రెండ్‌’ అంది. మరి.. ఆల్రెడీ ఈ జంట పెళ్లి చేసుకుందా? అనే క్వొశ్చన్‌కి ప్రస్తుతానికి నో ఆన్సర్‌. మరి.. శ్రియ పెళ్లాడినట్లు.. ఇలియానా, తాప్సీ, శ్రుతీహాసన్‌ కూడా తమ బాయ్‌ఫ్రెండ్‌తో మూడు ముళ్లు వేయించుకుంటారా? వెయిట్‌ అండ్‌ సీ.

జీన్‌తో జింతా
ప్రేమంటే ఇదేరా అంటూ ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడారు ప్రీతీ జింతా. ఈ నార్త్‌ బ్యూటీ తెలుగులో చేసిన ఫస్ట్‌ మూవీ ‘ప్రేమంటే ఇదేరా’ గర్తుండే ఉంటుంది. ‘నైజామ్‌ బాబులు.. నాటు బాంబులు..’ అంటూ జోరుగా ఆడిపాడారు జింతా. ఈ సొట్టబుగ్గల సుందరి శ్రీమతి అయి రెండేళ్లయింది. అమెరికన్‌ బిజినెస్‌మేన్‌ జీన్‌ గుడ్‌ ఎనఫ్‌ను 2016లో ఆమె పెళ్లాడారు. అమెరికాలో బంధువుల ద్వారా జీన్‌తో జింతాకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.  

సెలీనా జైట్లీ
ఆ ఇద్దరు... వాళ్లకు నలుగురు. అవును.. సెలీనా జైట్లీ–పీటర్‌ హ్యాగ్‌లకు నలుగురు బిడ్డలు. రెండుసార్లు కవలలకు జన్మనిచ్చారామె. మన దేశీ తార సెలీనాకి ఏడేళ్ల క్రితం పీటర్‌తో దుబాయ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చివరికి వారి మధ్య బంధంగా మారింది. హోటల్‌ బిజినెస్‌ చేస్తుంటారు పీటర్‌. ఇండియా వచ్చి, సెలీనా పేరెంట్స్‌ని కలిసి, పెళ్లికి ఒప్పించారు. ఎంగేజ్‌మెంట్‌ జరిగే సమయానికి సెలీనా ప్రెగ్నెంట్‌. 2011లో పెళ్లయింది. 2012 మార్చిలో సెలీనా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు. 2017లో మరో ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చారామె. భర్తతో కలసి సింగపూర్‌లో ఉంటున్నారామె. 
– సినిమా డెస్క్‌


మైఖేల్‌ కోర్సలేతో శ్రుతీహాసన్‌


ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా



సిరిల్‌ ఆక్సెన్‌ఫ్యాన్స్‌తో మల్లికా శెరావత్‌


మథియాస్‌ బోతో తాప్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement