సాధారణంగా భారీ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చోటు చేసుకోవడం పరిపారిటిగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల్లో ప్రముఖ హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో నటించడానికి వెనుకాడడం లేదు. అలాంటి పాటల్లో నటించడం వల్ల భారీ పారితోషికం ముడుతుండటం, పేరు రావడమే అందుకు కారణం. ఇకపోతే ఐటమ్ సాంగ్స్ చిత్రాలకు అదనపు ఆకర్షణగా మారుతున్నాయి. అలా నటి శ్రియ(Shriya Saran ) కూడా ఇంతకు ముందు ఐటమ్ సాంగ్స్‌లో నటించారు. కాగా తాజాగా మరోసారి అలాంటి సాంగ్‌తో యువకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
నటుడు సూర్య(Suriya) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో రెట్రో ఒకటి. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. ఈయన చిత్రాల్లో కమర్షియల్ అంశాలకు కొదవ ఉండదన్న విషయం తెలిసిందే. అలా రెట్రో చిత్రాన్ని పూర్తిగా కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్‌టెయినర్‌గా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకపుకుంటోంది. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
ఇందులో నటి శ్రియ ప్రత్యేక పాటలో నటించడం విశేషం. నటుడు సూర్యతో కలిసి ఆమె నటించిన ఈ పాటను ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా నటుడు సూర్య ప్రస్తుతం నటుడు ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment