'నవంబర్ నుంచి షూటింగ్ చేయోచ్చన్నారు' | Kamal Haasan starts shooting form november | Sakshi
Sakshi News home page

'నవంబర్ నుంచి షూటింగ్ చేయోచ్చన్నారు'

Published Sun, Sep 11 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

'నవంబర్ నుంచి షూటింగ్ చేయోచ్చన్నారు'

'నవంబర్ నుంచి షూటింగ్ చేయోచ్చన్నారు'

తన ఆఫీస్లో ప్రమాదానికి గురై కొంత కాలంగా షూటింగ్లకు దూరమైన లోకనాయకుడు కమల్ హాసన్ త్వరలో తిరిగి కెమెరా ముందుకు రానున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న ఈ గ్రేట్ యాక్టర్ నవంబర్ నుంచి తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయన్ని కమల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

'నవంబర్ నుంచి నేను షూటింగ్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్స్ చెప్పారు. మీ ప్రేమ కారణంగానే ఇంత త్వరగా కోలుకున్నాను. మీరు చూపించిన అభిమానాన్ని శభాష్ నాయుడు, ఇతర చిత్రాల ద్వారా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తా..' అంటూ కామెంట్ చేశారు కమల్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో శృతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement