Sabash Naidu
-
అంతా మేజిక్‌లా ఉంది!
‘‘మా నాన్నగారు వెరీ స్ట్రాంగ్. ఆయనకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందనుకున్నా. కానీ, చాలా త్వరగా కోలుకుంటున్నారు. అంతా మేజిక్‌లా అనిపిస్తోంది. త్వరలో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ మొదలుపెడతాం’’ అని శ్రుతీహాసన్ అన్నారు. దాదాపు ఏడు నెలల క్రితం కమల్‌హాసన్ ఇంట్లో పడిపోయిన విషయం, అప్పుడు ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దాదాపు రికవర్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘వాస్తవానికి నాన్నగారికి ప్రమాదం జరిగినప్పుడు నేను ఇండియాలో లేను. ఫోన్లో చెప్పారు. వినగానే చాలా బాధపడ్డాను. ఇండియా వచ్చాక ఆయన పరిస్థితి చూసి, కంగారుపడ్డాను. నాకు తెలిసి వేరే ఎవరైనా అయితే ఇంత త్వరగా కోలుకుని ఉండేవారు కాదు. నాన్నగారిలో ఉన్న సంకల్పసిద్ధిని ఇంతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు. ఆ విల్ పవరే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది. నేను, నాన్న తండ్రీ కూతుళ్లుగా నటిస్తోన్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. -
'నవంబర్ నుంచి షూటింగ్ చేయోచ్చన్నారు'
తన ఆఫీస్‌లో ప్రమాదానికి గురై కొంత కాలంగా షూటింగ్‌లకు దూరమైన లోకనాయకుడు కమల్ హాసన్ త్వరలో తిరిగి కెమెరా ముందుకు రానున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న ఈ గ్రేట్ యాక్టర్ నవంబర్ నుంచి తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయన్ని కమల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 'నవంబర్ నుంచి నేను షూటింగ్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్స్ చెప్పారు. మీ ప్రేమ కారణంగానే ఇంత త్వరగా కోలుకున్నాను. మీరు చూపించిన అభిమానాన్ని శభాష్ నాయుడు, ఇతర చిత్రాల ద్వారా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తా..' అంటూ కామెంట్ చేశారు కమల్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో శృతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.Doctors say I am fit to work from Nov possibly. All that love does heal faster. Thanks folks. I'll return that love via Naidu/Kundu & more— Kamal Haasan (@ikamalhaasan) 11 September 2016 -
మనసు ఉరకలేస్తోంది
నిత్యం తమ కార్యకలాపాలతో బిజీగా ఉండే వారికి ఒక్కసారిగా పని లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే సాధ్యం కాదు. జీవితమే శూన్యంగా కనిపిస్తుంది. అలాంటిది సినిమానే జీవితంగా గడిపే విశ్వనటుడు కమలహాసన్ సుమారు నెలకు పైగా ఖాళీగా అదీ ఇంట్లోనే గడపాలంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు. అయినా నిత్యం సినిమా గురించే ఆలోచించే కమలహాసన్ ఖాళీగా ఎందుకు కూర్చుంటారు చెప్పండి. శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను అమెరికాలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగొచ్చిన కమల్ తన కార్యాలయం మిద్దె పైనుంచి దిగుతూ కాలు జారి మెట్లపైనుంచి కింద పడి గాయాలకు గురైన సంగతి, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం కాస్త విశ్రాంతి పొందుతున్న విషయం విదితమే. అయినా పరామర్శించడానికి వచ్చిపోయే ప్రముఖలతో కాలం గడుపుతున్న కమల్ మరో పక్క తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాలుకు సిద్ధం అయ్యారట. పనికి మనసు ఉరకలేస్తోంది. అందుకు నేను సిద్ధం అయ్యాను. ఈ నెలలోనే తదుపరి షెడ్యూల్ మొదలు కానుంది. కాలు జారి పడడాన్ని సాధారణ విషయంగా భావించడం లేదు.దానికి సంబంధించి చిన్న కథ చెప్పాలి. ఈ విషయాన్ని మీతో తరువాత పంచుకుంటాను. ముందుగా వైద్యసేవలందించిన వైద్యులకు, అభిమానించేవారికి, బిజీగా ఉన్న వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.అంటూ కమలహాసన్ ఇటీవల తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయనకు జరిగిన విపత్తు కారణంగా శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్, విడుదల తేదీలన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చిత్రంలో నటిస్తున్న బ్రహ్మానందం, శ్రుతిహసన్, రమ్యకృష్ణ తదితరులు కాల్షీట్స్ గురించి చర్చలు జరుగుతున్నట్లు కమల్ వర్గం తెలిపింది. -
ఆ కథ చెప్పే తీరాలి!
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’. జూలై నెలాఖరున కమల్ ఆఫీసులో పోర్టికో కూలి కింద పడి, గాయం కావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. శస్త్రచికిత్స తరువాత గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కమల్, ‘‘మళ్లీ సినిమా వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాను. రెడీ టు రన్ ద షో ఎగైన్. నా మనసు గాల్లో విహరిస్తోంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ మధ్యకాలంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆ కథను మీ అందరికీ చెప్పే తీరాలి. త్వరలో తప్పకుండా చెబుతా. డాక్టర్లు, శ్రేయోభిలాషులు.. అందరికీ థ్యాంక్స్’’ అన్నారాయన. అమెరికాలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్లో ‘శభాష్ నాయుడు’లో సుమారు అరవై శాతం షూట్ చేశారట. ఈ చిత్రంలో కమల్ కూతురిగా శ్రుతీహాసన్, భార్యగా రమ్యకృష్ణ, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. -
ఆ వార్తలో నిజం లేదు!
‘‘మా నాన్నతో కలసి నటించే అవకాశం వస్తే అంతకన్నా సంతోషపడే విషయం మరొకటి ఉండదు’’ అని శ్రుతీహాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ‘శభాష్‌నాయుడు’ చిత్రంతో అది నెరవేరింది. కమల్ కూతురిగా ఈ చిత్రంలో శ్రుతి నటిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా కమల్‌హాసన్ నటించే అన్ని చిత్రాలకూ నటి, కమల్‌కి అత్యంత సన్నిహితురాలూ అయిన గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆమె ఆ బాధ్యత నిర్వరిస్తున్నారు. కాగా, కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమి-శ్రుతి మాటా మాటా అనుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లాస్ ఏంజిల్స్‌లో పెరిగే అమ్మాయిగా నటిస్తున్నారు. షూటింగ్ ఆరంభించక ముందు జరిగిన లుక్ టెస్ట్ కోసం గౌతమి తెచ్చిన డ్రెస్సుల్లో కొన్ని శ్రుతీకి అంత బాగా లేవనిపించాయట. మామూలుగా ఏ ఆర్టిస్ట్ అయినా తమ కాస్ట్యూమ్స్ గురించి దర్శక-నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్‌తో డిస్కస్ చేస్తుంటారు. అలా ఈ చిత్రం కోసం గౌతమి కాస్ట్యూమ్స్ తెచ్చినప్పుడు బెటర్మెంట్ కోసం శ్రుతి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారట. గౌతమి కూడా శ్రుతి అభిప్రాయాన్ని ఆమోదించి, మరికొన్ని డ్రెస్సులు తయారు చేయించారట. ఇదంతా స్నేహపూరిత వాతావరణంలో జరిగినప్పటికీ గౌతమి, శ్రుతి మాటా మాటా అనుకున్నారని ఎవరో ప్రచారం మొదలు పెట్టారు. శ్రుతీహాసన్ తన పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ద్వారా ‘అదేం లేదు’ అని స్పష్టం చేశారు. గౌతమి, శ్రుతి మధ్య మంచి అనుబంధం ఉందనీ, గౌతమిని తమ కుటుంబ సభ్యులలో ఒకరిలా శ్రుతి భావిస్తారని పీఆర్ టీమ్ పేర్కొంది. వాస్తవానికి కమల్‌హాసన్-గౌతమి ఒకే ఇంట్లో కలసి ఉంటున్నప్పటికీ శ్రుతి, అక్షర ఆ విషయంలో ఫీలైన దాఖలాలు కనిపించవ్. శ్రుతి అయితే ‘మా నాన్న అభిప్రాయాలను గౌరవిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గౌతమితో కూడా శ్రుతి, అక్షరలకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో గౌతమీతో తనకు మనస్పర్థలు వచ్చాయనే వార్త శ్రుతికీ బాధ కలిగించి ఉంటుంది. అందుకే ఇది కేవలం వదంతి మాత్రమే అని ఆమె స్పష్టం చేసి ఉంటారు. -
ఫేవరెట్ కార్నర్.. అదే ప్రమాదానికి కారణం
అది చెన్నైలోని ఆళ్వార్‌పేట. అక్కడ కమల్‌హాసన్ ఆఫీస్ ఉంది. ఇంట్లో, ఆఫీసులో ప్రతి గదికీ కార్నర్స్ ఉన్నట్లే ఆ ఆఫీసులో కూడా ఉన్నాయి. ఒక్కే ఒక్క కార్నర్ మాత్రం కమల్‌కి చాలా ఇష్టం. 18 అడుగుల ఎత్తులో ఉన్న ఒక గది కార్నర్ అది. ఆ మూల నిలబడితే రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నిలబడి రోడ్డుపై వచ్చే పోయే జనాలను చూస్తూ, ఒకవేళ అది కాకపోతే ఏదో ఆలోచిస్తూ టైమ్‌పాస్ చేస్తుంటారు కమల్. ఆ రోజు కూడా అలానే నిలబడ్డారు. ఎప్పుడూ తీపి అనుభవాలనే మిగిల్చిన ఆ కార్నర్ ఈసారి మాత్రం కమల్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆయన ఎక్కడైతే నిలబడ్డారో ఆ ప్రదేశం హఠాత్తుగా కుంగిపోయింది. దాంతో కమల్ 18 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. అంత ఎత్తు నుంచి పడటంతో దెబ్బలు తగిలి విపరీతంగా రక్తం పోయిందట. ‘‘లక్కీగా పక్కన మనుషులు ఉండటంవల్ల ఆస్పత్రిలో చేర్చారు. లేకపోతే చనిపోయి ఉండేవాణ్ణి’’ అని కమల్ పేర్కొన్నారు. ఆ మధ్య ఆయన జారిపడిన విషయం, కాలికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కమల్ మెట్ల మీద నుంచి జారిపడ్డారని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ ప్రమాదానికి కారణం ఆయనకు నచ్చిన ఆ కార్నర్. ఈ విషయాన్ని స్వయంగా కమలే తెలిపారు. మరో నెలలోపు ఆయన ‘శభాష్ నాయుడు’ షూటింగ్లో పాల్గొంటారనే వార్త వచ్చింది. దానికి కమల్ స్పందిస్తూ - ‘‘నెల రోజుల్లోనా? చాన్సే లేదు. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నా. కనీసం రెండు నెలలైనా పడుతుంది. ఆ తర్వాతే షూటింగ్’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఆయనకు రీల్ డాటర్‌గా నటిస్తున్నారు. -
అమెరికాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ షూటింగ్
కమల్ హాసన్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న ‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగు జోరుగా సాగుతోంది. దీనికోసం బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారట. వీళ్లిద్దరివీ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలని, అమెరికాలో కొనసాగుతున్న షూటింగులో వీళ్లిద్దరూ పాల్గొంటున్నారని సినిమా వర్గాలు తెలిపాయి. వాళ్ల పాత్రల చిత్రీకరణతో ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ పూర్తయిందని, వాళ్ల పాత్రల షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్తారని చెప్పారు. దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర పోషించిన కమల్.. అదే పాత్రను ప్రధాన పాత్రగా తీసుకుని దానికి సీక్వెల్లా ఈ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగుతో కూడా బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో కమల్ భార్య పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల కుమార్తెగా కమల్ కూతురు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. సినిమాకు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే, డిసెంబర్ 1న సినిమా విడుదలవుతుంది. -
మంగళవారం చాలా హాట్!
‘‘ఈరోజు కాలు బయట పెడితే మీరు మళ్లీ ఇంటి లోపల కాలు పెట్టడం కష్టం. అందుకే ఎవరూ బయటికి రావద్దు’’ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తే, ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం ఎవరూ చేయరు. కానీ, బయట బోల్డన్ని పనులు ఉన్నవాళ్లు మాత్రం రిస్క్ తీసుకుంటారు. ‘శభాష్ నాయుడు’ చిత్రబృందం అలానే చేసింది. కమల్‌హాసన్, బ్రహ్మానందం, శ్రుతీహాసన్ ముఖ్య తారలుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. సంవత్సరం మొత్తంలో ఈ మంగళవారం ఉన్నంత హాట్‌గా మరో రోజు ఉండదట. ఆ వేడి తట్టుకోవడం చాలా కష్టం అట. ‘‘రెండు రోజుల క్రితమే వాతావరణం గురించి అక్కడి వాళ్లు మాట్లాడుకుంటుంటే తెలిసింది. లాస్ ఏంజిల్స్ వాసులందరూ మంగళవారం ఇన్డోర్ లోనే ఉండాలని ప్రకటించారు. కానీ, మాకు తప్పుతుందా? మేం అవుట్డోర్ షూటింగ్ చేయాల్సి వచ్చింది’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. -
తప్పని పరిస్థితుల్లో దర్శకుడిగా..!
కమల్‌హాసన్‌లో మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రం చెప్పాలంటే ‘విశ్వరూపం’కి మించిన మంచి ఉదాహరణ లేదు. ఇలా నటనతో పాటు దర్శకత్వం మీద కూడా అవగాహన ఉండటం మంచి విషయమే. ఒక్కోసారి దర్శకుడికి కుదరకపోయినా, దర్శకత్వం వహించే పరిస్థితుల్లో ఆ దర్శకుడు లేకపోయినా.. అప్పుడు వెంటనే రంగంలోకి దిగొచ్చు. కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ విషయంలో అదే జరిగింది. ఈ చిత్రంలో కమల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ కోసం ఇటీవల ఈ చిత్రబృందం లాస్ ఏంజిల్స్ వెళ్లింది. మొదటి రోజు షూటింగ్ బాగానే జరిగింది. నాలుగో రోజు చిత్రదర్శకుడు టి. రాజీవ్‌కుమార్ అస్వస్థతకు గురి కావడంతో కమల్ నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ రాజీవ్ పరిస్థితి ఎలా ఉందనే విషయానికి వస్తే.. లైమ్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నారని డాక్టర్లు నిర్ధారించారట. ఐరోపా-ఉత్తర అమెరికాలో వచ్చే అరుదైన ఇన్ఫెక్షన్ ఇది అని సమాచారం. లాస్ ఏంజిల్స్‌లోని ది బెస్ట్ అనదగ్గ ఆస్పత్రిలో చేర్చి, రాజీవ్‌కు మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు షూటింగ్‌కు ఆటంకం కలగనివ్వకుండా కమల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
శభాష్ నాయుడును నేనే హ్యాండిల్ చేస్తున్నా
శభాష్ నాయుడు చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత కమలహాసన్ స్పష్టం చేశారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న చిత్రం శభాష్‌నాయుడు. ఇందులో విశ్వనాయకుడు కమలహాసన్, ఆయన కూతురు శ్రుతీహాసన్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనూ వారు తoడ్రీకూతుళ్లుగా నటించడం విశేషం. రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత బాణీలు కడుతున్నారు. కమలహాసన్ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషన ల్ లైకా ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి మలయాళ ప్రముఖ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే అమెరికాలో ప్రారంభం అయ్యింది. పలు ఆటంకాలను అధిగమించి చిత్ర యూనిట్ అమెరికా చేరుకున్నట్లు కమల్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కాగా నటుడిగా నిర్మాతగా బాధ్యతల్ని మోస్తున్న విశ్వనటుడికిప్పుడు అనివార్య కారణాల వల్ల అదనంగా దర్శకత్వం బాధ్యత భుజాన పడింది. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా అంగీకరించారు. ఆయన తెలుపుతూ శభాష్‌నాయుడు చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని తాను నిర్వహిస్తున్నానన్నారు.క ారణం అమెరికాలోని లాస్ఏంజెల్స్లో చిత్ర షూటింగ్ ప్రారంభమైన నాలుగో రోజునే దర్శకుడు రాజీవ్‌కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఆయన లైమ్ అనే వ్యాధికి గురయ్యారని చెప్పారు. ఇది ఐరోపా, ఉత్తర అమెరికా ప్రాంతాలలో సోకే అరుదైన వ్యాధి అని తెలిపారు. దీంతో దర్శకుడు లాస్ఏంజెల్స్లోని ఆస్పత్రిలో ఉన్నత వైద్యం పొందుతున్నారని చెప్పారు. ఆయనను చిత్ర యూనిట్‌కు చెందిన సభ్యుడొకరు 24 నాలుగు గంటలు కనిపెట్టుకుని సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్శకుడు రాజీవ్‌కుమార్ కోలుకుని తిరిగొచ్చే వరకూ శభాష్‌నాయుడు చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని తానే నిర్వహిస్తానని అన్నారు. చిత్రాన్ని జూలై నెల చివరికీ లేదా ఆగస్టు నెల తొలి వారానికల్లా పూర్తి చేయడానికి ప్రణాళికను చేసినట్లు కమల్ పేర్కొన్నారు. ఈ విశ్వనటుడికి దర్శకత్వం కొత్తేమీ కాదు కదా. ఇంతకు ముందు విరుమాండి, హేరామ్, విశ్వరూపం మొదలగు పలు విజయవంతమైన చిత్రాలను కమల్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. -
మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్
చెన్నై: సాహసం, వైవిద్యం, విభిన్నత వంటి అంశాలే పరమావధిగా ఎప్పటికప్పుడు తనను నిత్యనూతనంగా పరిచయం చేసుకునే విలక్షణ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసాహసానికి దిగాడు. తన చిత్రానికే తానే దర్శకత్వం వహించుకునే బాధ్యతలు భుజాన వేసుకున్నారు. తన చిత్ర దర్శకుడు అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ఈ పని చేస్తున్నారు. కమల్ తాజాగా నటిస్తున్న చిత్రం శబాష్ నాయుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సినిమా ప్రేక్షకులముందుకు తీసుకురావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే దర్శకత్వంలో పట్టున్న కమల్.. ఈ చిత్రానికి ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేందుకు దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 'మా దర్శకుడు రాజీవ్ బాగా అస్వస్థతతో ఉన్నారు. లాస్ ఎంజెల్స్‌లో మేం షూటింగ్ జరుపుకుంటున్న నాలుగో రోజు ఇలా జరగడం దురదృష్టం. ఆయన లైమ్ డిసీజ్‌కు లోనయ్యారు. ఉత్తర అమెరికా, యూరప్ లో మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధి ఇది. అందుకే నేను నా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను' అని కమల్ సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. అలాగే లాస్ ఎంజెల్స్ లోని ప్రముఖ ఆస్పత్రిలో తమ డైరెక్టర్ వైద్య చికిత్స పొందుతున్నారని చెప్పారు. -
'శభాష్ నాయుడు' గా కమల్
చెన్నై : వైవిధ్యభరిత చిత్రాలకు మారు పేరుగా నిలిచే విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో 'శభాష్ నాయుడు'గా రానున్నారు. ఏక కాలంలో మూడు భాషలలో నిర్మాణం కానున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం చెన్నైలో జరిగింది. తమిళం, తెలుగు భాషలలో శభాష్ నాయుడు గాను, హిందీలో 'శభాష్ కుండు' గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించి, కథా నాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో లైకా ప్రొడక్షన్ సంస్థ భాగస్వామ్యం కావడం విశేషం. దీనికి ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా చిత్రానికి తమిళ టైటిల్‌తో పాటు సంగీతాన్ని అందిస్తున్నారు. కమల్.. కుమార్తె శ్రుతిహాసన్‌తో కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని కమల్ హాసన్ వెల్లడించారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మే నెల 14 నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్టు.. జూన్, జూలై నెలల్లో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు కమల్ తెలిపారు. దశావతారం చిత్రంలోని పది పాత్రల్లో అందరినీ నవ్విస్తూ ఉండే బలరామ్ నాయుడు పాత్ర విస్తరణే చిత్ర కథ అని, శ్రుతి ఇందులో తనకు కూతురిగా నటిస్తున్నారని ఆయన వెల్లడించారు.